తయారీ విధానం: అరకేజీ చికెన్ (Chicken) తీసుకుని నీటిలో శుభ్రపరచుకొని అరగంట పాటు ఉప్పు నీటిలో (Salt water) నానబెట్టుకోవాలి. అరగంట తరువాత ఉప్పు నీటిలో నుంచి చికెన్ ను తీసి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసి మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.