సమ్మర్ స్పెషల్.. చింతచిగురు ఎండు రొయ్యల ఫ్రై ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!

Published : May 09, 2022, 03:18 PM IST

చింతచిగురుతో (Chintachiguru) చేసుకునే వంటలు పుల్లపుల్లగా భలే రుచిగా ఉంటాయి.  

PREV
19
సమ్మర్ స్పెషల్.. చింతచిగురు ఎండు రొయ్యల ఫ్రై ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!

ఈ చిగురు వంటలకు రుచి అందించడమే కాదు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే చింతచిగురుకు ఎండు రొయ్యలను (Dried prawns) జోడించి చేసుకునే ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

29

కావలసిన పదార్థాలు: రెండు కప్పుల లేత చింతచిగురు (Chintachiguru), ఒక కప్పు ఎండు రొయ్యలు (Dried prawns), రెండు ఉల్లిపాయలు (Onions), మూడు పచ్చిమిరపకాయలు (Chilies), సగం టీస్పూన్ జీలకర్ర (Cumin), కొన్ని కరివేపాకులు (Curries).
 

39

ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), పావు స్పూన్ పసుపు (Turmeric), రుచికి  సరిపడా ఉప్పు (Salt), ఒక టీ స్పూన్ కారం (Chili powder), సగం టీస్పూన్ ధనియాలపొడి (Coriander powder), పావు కప్పు నూనె (Oil).
 

49

తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి ఒక కప్పు తల, తోక తీసేసిన ఎండు రొయ్యలను వేసి తక్కువ మంటమీద వేపుకోవాలి. ఇలా రొయ్యలను తక్కువ మంట (Low flame) మీద వేపుకుంటే రొయ్యలకు ఉండే వాసన తగ్గిపోతుంది. ఇలా ఐదు నిమిషాల పాటు వేయించుకొని (Frying) పక్కన పెట్టుకోవాలి.
 

59

ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతుండగా ఇందులో వేయించుకున్న ఎండు రొయ్యలను (Fried dried prawns) వేసి వెంటనే తీసేయాలి. ఇలా మరుగుతున్న నీటిలో (Boiling water) రొయ్యలను వేసి తీసేస్తే రొయ్యలకు ఉన్న దుమ్ము, ధూళి, ఇసుక  తొలగిపోయి రొయ్యలు శుభ్రపడతాయి.
 

69

ఇప్పుడు స్టవ్ మీద మరల కడాయి పెట్టి నూనె వేసి నూనె (Oil) వేగిన తరువాత జీలకర్ర, కరివేపాకులు వేసి వేపుకోవాలి. తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల తరుగు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు (Until softened) తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
 

79

ఉల్లిపాయలు మెత్తబడ్డాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ ల నీళ్లు (Water) వేసి బాగా కలుపుకుని మసాలా మాడకుండా మూతపెట్టి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. మసాలా నుంచి నూనె పైకి తేలేవరకు వేపుకోవాలి.
 

89

ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రపరిచిన రొయ్యలను (Cleaned prawns) వేసి నీళ్లు వెయ్యకుండా (Without watering) మూత పెట్టి పది నిముషాల పాటు వేయించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకుంటే కూర అడుగంటకుండా ఉంటుంది. రొయ్యలు బాగా మగ్గిన తరువాత లేత చింతచిగురు వేసి కలుపుకొని ఉడికించుకోవాలి.
 

99

చివరిలో ధనియాలపొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) చింతచిగురు ఎండు రొయ్యల ఫ్రై (Chintachiguru Dried prawns Fry) రెడీ. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

click me!

Recommended Stories