మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి.. వెంటనే మీలో మార్పులు ఖాయం?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 19, 2021, 09:52 PM IST

మ‌నం సాధార‌ణంగా ఎదుర్కొనే చ‌ర్మ స‌మ‌స్య‌లు (Skin Problems) కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్య‌మైన‌వి మొటిమ‌లు(Pimples). టీనేజ్‌లోకి ప్ర‌వేశిస్తున్న వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువుగా ఉంటుంది.

PREV
17
మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి.. వెంటనే మీలో మార్పులు ఖాయం?

మ‌నం సాధార‌ణంగా ఎదుర్కొనే చ‌ర్మ స‌మ‌స్య‌లు (Skin Problems) కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్య‌మైన‌వి మొటిమ‌లు(Pimples). టీనేజ్‌లోకి ప్ర‌వేశిస్తున్న వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువుగా ఉంటుంది. ఈ సమస్య అబ్బాయిలని, అమ్మాయిలని ఇద్దరిని బాధిస్తూ ఉంటుంది.
 

27

ఈ మొటిమ‌లు (Pimples) వ‌చ్చిన‌ప్పుడు ముఖ‌సౌంద‌ర్యం అంద‌విహీనంగా త‌యార‌వుతుంది. మొటిమ‌లు వ‌చ్చిన‌ప్పుడు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు ఎక్కువ రాకుండా, వాటి నుంచి ఉప‌శ‌మ‌నం (Subsidiary) పొందేందుకు ర‌క‌ర‌కాల తంటాలు ప‌డుతుంటారు.
 

37

మొటిమ‌లు (Pimples) త‌గ్గిన చోట వాటి మ‌చ్చ‌లు అలాగే ఉండిపోతాయి. అలాంట‌ప్పుడు వీటి నుంచి ఉప‌శ‌మ‌నం పొందడానికి ఆర్టిఫిషియల్ ఫేస్ క్రీముల (Face Creams) కంటే ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.
 

47

మొటిమలు తగ్గించడానికి ఒక కప్పులో  2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను (Coconut Oil),  కర్పూరపు (Camphor) పొడిని తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలున్న చోట అప్లై చేసుకోవాలి. ఇలా వారం రోజులు చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి. 
 

57

ప‌చ్చ‌టి తుల‌సి (Tulasi)ఆకులు, పుదీనా ఆకులు (Mint) ర‌సానికి రెండు మూడు చుక్క‌ల నిమ్మ‌ర‌సం (Lemon) క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని మొటిమ‌ల మీద రాస్తే మొటిమల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
 

67

మొటిమల వల్ల వచ్చిన మచ్చలు తగ్గించడానికి ఒక కప్పులో 1స్పూన్ పెరుగు (Curd),1స్పూన్ నిమ్మరసం (Lemon) తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా 15 రోజులపాటు చేస్తే మచ్చలు తగ్గుతాయి.
 

77

మొటిమలు తగ్గాక ముఖంలో కొంద‌రికి చ‌ర్మ‌గ్రంథులు పెద్ద‌గా అవుతాయి. ఈ స‌మ‌స్య‌కు టమాటా తో చెక్ పెట్టవచ్చు. రెండు చెంచాల టమాటా (Tomato)రసంలో రెండు చుక్క‌ల నిమ్మ‌ర‌సం (Lemon) క‌లిపి ముఖ‌మంతా రాసుకోవాలి. ప‌దిహేను నిమిషాల‌య్యాక గోరు వెచ్చ‌ని నీళ్ల‌తో క‌డిగేస్తే స‌రిపోతుంది.

click me!

Recommended Stories