ఈ లక్షణాలు ఉన్నాయంటే మీకు మధుమేహం ఉన్నట్టే.. అవేంటో వెంటనే తెలుసుకోండి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 19, 2021, 09:28 PM IST

మధుమేహం (Diabetes) అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి (Chronic disease). ఇది చిన్న లక్షణాల ద్వారా బహిర్గతమవుతుంది. ఈ వ్యాధి వృద్ధులనే కాదు యువతను కూడా వేధిస్తోంది. 

PREV
18
ఈ లక్షణాలు ఉన్నాయంటే మీకు మధుమేహం ఉన్నట్టే.. అవేంటో వెంటనే తెలుసుకోండి!

మధుమేహం (Diabetes) అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి (Chronic disease). ఇది చిన్న లక్షణాల ద్వారా బహిర్గతమవుతుంది. ఈ వ్యాధి వృద్ధులనే కాదు యువతను కూడా వేధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
 

28

డయాబెటిస్ రెండు రకాలు టైప్-1, టైప్-2 డయాబెటిస్. టైప్-1 డయాబెటిస్ చిన్నతనంలోనే గుర్తిస్తారు. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్ ను (Insulin) వాడాల్సి ఉంటుంది. టైపు-2 డయాబెటిస్ వంశపారపర్యంగా (Genealogically) వస్తుంది. ఇది వెంటనే బయటపడదు.
 

38

తరచు దాహం వేయడం, అలసట (Fatigue) ఎక్కువగా ఉంటుంది. చూపు మసకబారటం, నీరసం, గాయాలు త్వరగా మానకపోవటం లాంటివి డయాబెటిస్ లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ (Diabetes) మీలో ఉన్నట్లే.
 

48

ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నపుడు, లేదా ఎవరికైనా రక్తదానం (Blood Donation) చేయాల్సివచ్చినపుడు చాలామందిలో మధుమేహం బయటపడుతుంది. ప్రెగ్నెన్సీ (Pregnancy) సమయంలో కూడా చాలా మందిలో స్త్రీలలో మధుమేహం బయటపడుతుంది. 
 

58

డయాబెటిస్ ఉన్న వారిలో దాహం (Thirst) ఎక్కువగా ఉండుటకు రక్తంలో పెరిగిన చక్కెర స్థాయి అని చెప్పవచ్చు. ఇతరులతో పోలిస్తే వీరిలో రక్తంలో చక్కెర (Sugar Levels) స్థాయి అధికంగా ఉంటుంది. దాంతో వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది.
 

68

తరచుగా మూత్ర విసర్జనకు ముఖ్యంగా రాత్రి  సమయంలో (Night Time) ఎక్కువగా వెళ్తుంటారు. దానికి కారణం రక్తంలో అధిక గ్లూకోజ్ (Glucose) స్థాయిని సూచించడం. అకస్మాత్తుగా బరువులో తగ్గుదల ఏర్పడుతుంది. దీనికి కారణం రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుదల.
 

78

చక్కెర వల్ల మధుమేహం వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. చక్కెర వ్యాధికి, చక్కెరకు సంబంధం లేదు. చక్కెర ఎక్కువగా తీసుకుంటే శరీరం బరువు పెరుగుతుంది. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. స్థూలకాయం (Obesity) వల్ల కూడా మధుమేహం (Diabetes) వచ్చే ప్రమాదం ఉంది.
 

88

డయాబెటిస్ ఉన్నవారు తరచు రక్త పరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిని పెరగకుండా చూసుకోవాలి. తమ జీవన శైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు (Healthy Food) అలవాట్లను చేర్చుకుంటే మధుమేహం (Diabetes) సమస్య నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

click me!

Recommended Stories