చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేసి చూడండి!

First Published | Oct 19, 2021, 9:36 PM IST

శరీర అందాన్ని పెంచడంలో జుట్టు (Hair) కూడా ప్రధానమైనది. జుట్టు నల్లగా నిగనిగలాడలని అందరూ అనుకుంటారు. ఇప్పుడున్న కాలంలో పోషకాల లోపం వల్ల వయసు మీద పడ్డ వాళ్ళల్లోనే కాకుండా వయసున్న వాళ్ళల్లో కూడా తెల్లజుట్టు (White Hair) సమస్య ఎక్కువగా ఉంటుంది.

జుట్టు కుదుళ్లలో మెలనోసైట్స్ (Melanocytes) ఉంటాయి. ఈ మెలనోసైట్స్ మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలనిన్ అనే పదార్థం కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ పట్టినప్పుడు జుట్టు నల్లగా మారుతుంది. ఒత్తిడివల్ల లేదా వంశపార లక్షణాల వల్ల కూడా మెలనిన్ ఉత్పత్తి తగ్గడంతో జుట్టు తెల్లగా మారుతుంది.
 
Latest Videos

దీంతో నల్ల జుట్టు కోసం మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ లను వాడుతుంటారు. వాటిని వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం. కానీ వాటిని ఉపయోగించకుండా ఉండలేరు. కాబట్టి కెమికల్స్ (Chemicals) ఉన్న పదార్థాల కంటే సహజ పదార్ధాలను (Natural Ingredients) వాడటం మంచిది. మరి అవేంటో తెలుసుకుందాం..
 
ఒక గిన్నెలో కొబ్బరి నూనె (Coconut Oil) తీసుకొని అందులో కొన్ని కరివేపాకు (Curry leaves) ఆకులను వేసి ఆకులు నల్లగా మారే వరకూ వేడి చేయాలి. ఇలా వేడి చేసి చల్లార్చిన నూనెను వడగట్టాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించి, 45 నిమిషాల తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి.

2 టేబుల్ స్పూన్ల హెన్న పౌడర్ (Henna Powder) లో ఒక టీస్పూన్ మెంతి పొడి, ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, 2 టీ స్పూన్ ల మింట్ జ్యూస్, 2 టీ స్పూన్ ల తులసి రసం (Menthi, Curd, Tulasi) అన్నింటిని మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను తలకు పట్టించి 2 గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి. దీనివల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
 
మందార (Hibiscus) పువ్వులను మిక్సీలో వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ లో కొబ్బరి నూనె  (Coconut oil) వేసి బాగా కలపాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని తలమాడుకు బాగా మర్ధన చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. దీని వల్ల జుట్టు నల్లగా మారుతుంది.

click me!