రెండవ బిడ్డకు జన్మనివ్వడంలో సమస్యలా.. అయితే ఈ పద్ధతి పాటించి చూడండి..

First Published Oct 14, 2021, 4:51 PM IST

స్త్రీ జీవితంలో గర్భధారణ (Pregnancy) అనేది దేవుడిచ్చిన గొప్పవరం. స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం ఆ స్త్రీకు మరో జన్మతో సమానం. ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడంతో అమ్మ అనే మధురమైన పిలుపును సొంతం చేసుకుంటుంది. 

స్త్రీ జీవితంలో గర్భధారణ (Pregnancy) అనేది దేవుడిచ్చిన గొప్పవరం. స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం ఆ స్త్రీకు మరో జన్మతో సమానం. ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడంతో అమ్మ అనే మధురమైన పిలుపును సొంతం చేసుకుంటుంది. ఒకసారి బిడ్డకు జన్మనిచ్చాక ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడంలో (Pregnancy Problems) సజావుగా సాగడంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. ఇంతకు అవేంటో తెలుసుకుందాం.. 
 

మీ జీవితంలో మొదటి బిడ్డ పుట్టిన తర్వాత వచ్చిన మార్పులను గమనించండి. ఆహారపు అలవాట్లు (Food Habits) సమతుల్యంగా ఉన్నాయో లేదో పరిశీలించండి. పని ఒత్తిడి తగ్గించుకుని, చాలా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. చెడు అలవాట్ల (Bad వల్ల సంతానోత్పత్తి తగ్గే అవకాశం ఉంది.               
 

తల్లి అవ్వడంతో బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడంలో సరైన నిద్ర (Sleeping Problems) ఉండదు. దీంతో నిద్రలేమి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది గర్భాశయం పైన ప్రభావితం చూపుతుంది. కాబట్టి సరైన నిద్ర పోవాలని వైద్య నిపుణులు (Health Problems) అంటున్నారు.   
 

మొదటి ప్రసవం తరువాత ఏవైనా ఆరోగ్య సమస్యలకు గురైయినచో గర్భధారణపై (Pregnancy) ప్రభావితం చూపుతుంది. సంతానోత్పత్తికి సహాయపడే హార్మోన్ల సంఖ్య తగ్గి గర్భధారణ జరగదు. కాబట్టి డాక్టర్ల సలహా మేరకు సంతానోత్పత్తికి సహాయపడే ఔషధాలను వాడాలి.            
 

మొదటి ప్రసవం తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటివల్ల శరీరం బరువు (Weight Gain) పెరుగుతుంది లేక కొంత మేరకు తగ్గుతుంది. శరీరం యొక్క బరువు గర్భాశయంపైన (Pregnancy) ప్రభావితం చూపుతుంది. కాబట్టి శరీర బరువును సమతుల్యంగా ఉంచుకోవాలి. 
 

వయసు 35 దాటిన తరువాత రుతు చక్రంలో మార్పులు వస్తాయి. వీటిద్వారా రెండవ బిడ్డ జన్మనివ్వడంలో  సమస్యలు ఏర్పడుతాయి. వయసు 35 దాటక ముందే డాక్టర్ (Doctor Suggestion) సలహాలతో గర్భధారణకు సిద్ధం చేసుకోవాలి. సంతానోత్పత్తి కాలంలో గర్భం ధరిస్తే విజయం మీ సొంతం.

click me!