ఈ ఆయుర్వేదా మూలికలతో ఆరోగ్యమైన గుండె.. అవేంటంటే?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 13, 2021, 02:50 PM IST

మన శరీరంలో అతి ముఖ్యమైనది గుండె. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. గుండె శరీరంలో వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాల విలువలను అందించే రక్తాన్ని సరఫరా చేస్తుంది. అధిక బరువు (obesity) కొవ్వుశాతం ఉండటం వలన గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

PREV
16
ఈ ఆయుర్వేదా మూలికలతో ఆరోగ్యమైన గుండె.. అవేంటంటే?

మన శరీరంలో అతి ముఖ్యమైనది గుండె. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. గుండె శరీరంలో వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాల విలువలను అందించే రక్తాన్ని సరఫరా చేస్తుంది. అధిక బరువు (obesity) కొవ్వుశాతం ఉండటం వలన గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.     
కేవలం ఆహారం, మూలికా మందులు, వ్యాయామం, ధ్యానం వంటివి గుండెను (heart health) ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కొన్ని ఆయుర్వేదిక మూలికలు (ayurvedic herbs) కూడా గుండె ఆరోగ్యానికి  దోహదపడతాయి. కాబట్టి ఆ మూలికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.    

26

అర్జున చెట్టు: అర్జున చెట్టులో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా వైద్యపరంగా అబ్బురపరిచే శక్తి దానిలో ఉన్నాయి. గుండెజబ్బుల (heart problems) వారికి దీన్ని ఔషధంగా ఉపయోగిస్తారు.  దీని బెరడులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడే యాంటీ -హైపర్ టెన్సివ్ లక్షణాలు ఇందులో ఉన్నాయి.
 

36

అమలకి: అమలకిని ఆమ్లా అని పిలుస్తారు. ఇందులో  పులుపు ప్రధానమైనా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆమ్లా (amal) రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాలేయం, గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ అల్సర్, మధుమేహం వంటి ఇతర సమస్యలతో బాధపడేవారికి ప్రయోజనాత్మకంగా ఉంటుంది.
 

46

మొరింగ: మొరింగను మునగ చెట్టు అని కూడా పిలుస్తారు. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడే మరో మూలిక. మొరింగ కొలెస్ట్రాల్ తగ్గే లక్షణాలను కలిగి ఉంటుంది. దీని ఆకులు, కాయలు, పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది యాంటీ యాక్సిడెంట్ (anti-accidents)లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గుండె పనితీరుకు మంచి మేలు చేస్తుంది.
 

56

అవిసె గింజలు: అవిసే చెట్టును సంస్కృతంలో ఉమా అని అంటారు. దీని ఆకులు, పువ్వులు రుచికి చేదుగా ఉంటాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తుంది. శరీరాన్ని నాజూగ్గా చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్ రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. (Heart problems) గుండె జబ్బుల సమస్యల నుండి ఈ గింజలు బాగా సహాయపడుతాయి.
 

66

పసుపు:  పసుపు మనం వంటల్లో ఉపయోగించే ఒక పదార్థం. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు శాస్త్రీయ నామం కురుక్యూమాలొంగా. పసుపు రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పసుపు (Turmerics) తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవే కాకుండా బ్రహ్మీ, తులసి, అశ్వగంధ వంటి ఇతర వన మూలికలు కుడా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

click me!

Recommended Stories