మీరు జామకాయ తింటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు గ్యారంటీ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 13, 2021, 09:38 PM IST

జామ పండులో (guava fruit) ఎన్నో పోషక విలువలు ఉంటాయి. చౌకగా దొరికే పండ్లలో ఇది ఒకటి. ఈ పండు సంవత్సర కాలం దొరుకుతుంది. 

PREV
19
మీరు జామకాయ తింటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు గ్యారంటీ

జామ పండులో (guava fruit) ఎన్నో పోషక విలువలు ఉంటాయి. చౌకగా దొరికే పండ్లలో ఇది ఒకటి. ఈ పండు సంవత్సర కాలం దొరుకుతుంది. జామ పండు జ్యూస్ తీసుకొనుట వలన కొలెస్ట్రాల్ను తగ్గించి, కాలేయ సమస్యలను మెరుగు పరుస్తుంది.                                      
 

29

జామపండును (guava fruit) ప్రతిరోజు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచి మలబద్దక సమస్యలను తగ్గిస్తుంది. జామపండులో సి-విటమిన్ (c vitamin) విలువలు నారింజ పండులో కంటే ఎక్కువగా ఉంటాయి.
 

39

అరటిలో ఎంత పొటాషియం ఉంటుందో... జామలోనూ అంతే ఉంటుంది. జామపండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటిన్, పొటాషియం (potassium) ఉంటాయి. ఇక నీరు 80 శాతం ఉంది. ఫలితంగా జామ తింటే... దాహం తిరుతుంది.                 
 

49

ఒక జామకాయ  (guava fruit) తింటే 112 కేలరీలు వస్తాయి. 23 గ్రాముల కార్బొహైడ్రేట్స్ (పిండిపదార్థం), ఫైబర్ లభిస్తాయి. అలాంటి పండును తింటే కొన్ని సమస్యలు గ్యారంటీ అని వైద్య నిపుణులు అంటున్నారు. మరీ అవేంటో తెలుసుకుందాం..
 

59

గ్యాస్ సమస్యతో (gas problem) బాధపడేవారు జామపండుకు దూరంగా ఉండాలి. జామపండులో విటమిన్ సి, (vitamin c) pప్రోక్టోస్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి వలన కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు రాత్రివేళలో జామ పండును తినరాదు.                                               
 

69

మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు జామపండుకు దూరంగా ఉండాలి. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండటం వలన మూత్రం ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వారు ఈ పండుకు దూరంగా ఉండటం మంచిది.       
 

79

డయాబెటిస్ ఉన్నవారు జామపండ్లను తినవచ్చు. కానీ పరిమితి ఉంటుంది. ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే... జామలో 9 గ్రాముల సహజమైన చక్కెర ఉంటుంది. జామ (guava fruit) తిన్నాక తప్పనిసరిగా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి.                                 
 

89

జలుబు, దగ్గు (cough problem)సమస్యలతో బాధపడేవారు జామ పండును తినరాదు. జామపండును రాత్రి వేళల్లో తినరాదు. రాత్రి వేళల్లో తీసుకొనుట వలన ఉదయానికి జలుబు, దగ్గు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.                                            
 

99

జామ పండును రెండు భోజనాల మధ్యలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. రాత్రి వేళలో తీసుకున్నచో కడుపుబ్బరం, జలుబు,(cold) దగ్గు, మూత్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు జామకాయలు  (guava fruit) తినకూడదు.

click me!

Recommended Stories