నోరూరించే స్పైసీ ములక్కాడ చికెన్ కూర.. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

Published : May 05, 2022, 03:37 PM IST

చాలా మంది చికెన్ (Chicken) తినడానికి ఇష్టపడతారు. ఈసారి కాస్త వెరైటీగా చికెన్ ను మునక్కాడలతో కలిపి కూర వండుకోండి. ఈ కూర భలే రుచిగా ఉంటుంది.   

PREV
19
నోరూరించే స్పైసీ ములక్కాడ చికెన్ కూర.. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

కావలసిన పదార్థాలు: అర కేజీ చికెన్ (Chicken), మూడు మునక్కాడ ముక్కలు (Drumsticks), రెండు ఉల్లిపాయలు (Onions), రెండు టమోటాలు (Tomatoes), ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), పావు టీ స్పూన్ పసుపు (Turmeric).
 

29

రెండు టేబుల్ స్పూన్ ల కారం (Chili powder), రెండు రెబ్బలు కరివేపాకుల (Curries) తరుగు, సగం స్పూన్ గరం మసాలా (Garam masala), ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice), కొత్తిమీర (Coriander) తరుగు, పావు కప్పు నూనె (Oil).
 

39

మసాలా కోసం: రెండు టేబుల్ స్పూన్ ల ధనియాలు (Coriander), ఏడు లవంగాలు (Cloves), ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర (Cumin), ఐదు యాలకులు (Cardamom), ఒక ఇంచు దాల్చిన చెక్క (Cinnamon), రెండు టేబుల్ స్పూన్ ల ఎండు కొబ్బరి (Dried coconut) తరుగు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు (Poppies). 
 

49

తయారీ విధానం: మసాలా కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు, లవంగాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, ఎండుకొబ్బరి ఇలా ఒకదాని తరువాత ఒకటి మసాలా దినుసులన్నింటిని (Spices) వేసి మంచి వాసన వచ్చేవరకు తక్కువ మంట (Low flame) మీద వేపుకోవాలి.
 

59

మసాలా దినుసులన్నీ వేగిన తరువాత చివరిలో ఒక టేబుల్ స్పూన్ గసగసాలను వేసి వేపుకొని తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు అన్ని చల్లారాక మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్లు (Water) కలిపి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి.
 

69

నూనె (Oil) వేడి అయిన తరువాత ఉల్లిపాయల తరుగు, కరివేపాకులు వేసి ఉల్లిపాయలు మెత్తబడి లేత బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ బాగా వేపుకోవాలి (Fry well).
 

79

ఇప్పుడు ఇందులో పసుపు, కారం వేసి కలుపుకొని టమోటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఒక నిమిషం తరువాత పావు కప్పు నీళ్లు వేసి మూతపెట్టి టమోటాలు (Tomatoes) బాగా మగ్గి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.  టమోటాలు బాగా మగ్గిన తరువాత ఇందులో చికెన్ (Chicken) వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
 

89

ఐదు నిమిషాల తరువాత మునక్కాడ ముక్కలు (Drumsticks), మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాల, ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకుని మూతపెట్టి ఇరవై నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి (Cook). అయితే మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే కూర అడుగంటకుండా ఉంటుంది.
 

99

చికెన్, మునక్కాడ ముక్కలు బాగా ఉడికిన తరువాత చివరిలో కొత్తిమీర తరుగు, గరం మసాలా, నిమ్మరసం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) చికెన్ మునక్కాడలు కూర (Chicken Drumsticks Curry) రెడీ.

click me!

Recommended Stories