స్త్రీ, పురుషులిద్దరిలోనూ వృద్ధాప్య ఛాయలను తగ్గించి నిత్యయవ్వనంగా మార్చే పదార్ధాలు ఇవే!

Published : May 05, 2022, 02:35 PM IST

ప్రస్తుత కాలంలో రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలోని మార్పులు..  

PREV
110
స్త్రీ, పురుషులిద్దరిలోనూ వృద్ధాప్య ఛాయలను తగ్గించి నిత్యయవ్వనంగా మార్చే పదార్ధాలు ఇవే!

జీవనశైలిలో కొన్ని చెడు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలను (Symptoms of aging) ఎదుర్కోవలసి వస్తోంది. కనుక వృద్ధాప్య ఛాయలకు దూరంగా ఉండి నిత్యం యవ్వనంగా కనిపించేందుకు మన జీవనశైలిలో కొన్ని ఆహార పదార్థాలను (Foods) చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

210

మెంతి ఆకులు: మెంతి ఆకులలో (Menthi leaves) మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను శుభ్రపరిచి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో చర్మ సమస్యలను (Skin problems) తగ్గి వృద్ధాప్య ఛాయలకు దూరంగా ఉండవచ్చు.
 

310

దానిమ్మ పండు: దానిమ్మ (Pomegranate) పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ని తగ్గించడానికి సహాయపడుతాయి. దీంతో వయసు పైబడటంతో వచ్చే మచ్చలు, ముడతలు తగ్గిపోతాయి. కనుక ప్రతిరోజూ నూరు గ్రాముల దానిమ్మ గింజలను తీసుకుంటే యవ్వనంగా కనిపిస్తారు.
 

410

అవకాడో: అవకాడోలో (Avocado) ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు (Omega 3 fatty acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తగినంత తేమను అందించి చర్మాన్ని తేమగా ఉంచడం తోపాటు ముడుతలు, పొడిబారే వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతాయి.
 

510

బ్లూ బెర్రీ: బ్లూ బెర్రీలను (Blue berry) తీసుకుంటే శరీరంలోని అధిక కొవ్వు తగ్గిపోతుంది. అలాగే చర్మానికి రక్త సరఫరా (Blood supply) సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి సహాయపడే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో వృద్ధాప్య లక్షణాలకు దూరంగా ఉండవచ్చు.
 

610

పెరుగు: పెరుగును (Yogurt) ప్రతిరోజూ తీసుకుంటే వయస్సు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం (Calcium) ఎముకలను, చర్మకణాలను దృఢంగా చేస్తుంది. దీంతో వృద్దాప్య లక్షణాలకు దూరంగా ఉండి అందంగా, యవ్వనంగా కనిపిస్తారు.
 

710

బాదం పప్పు: బాదం (Almond) పప్పులో విటమిన్ ఇ (Vitamin E), ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను పునరుద్ధరణ చేసి స్త్రీ, పురుషులిద్దరిలో వృద్ధాప్యంలో వచ్చే సంకేతాలను తగ్గిస్తాయి. కనుక ప్రతిరోజూ నానబెట్టిన బాదం పప్పును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

810

గుడ్డు: గుడ్డు (Egg) మంచి పౌష్టికాహారం. ఇది కండరాల పటుత్వాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మకణాలను ఎక్కువ కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఇందులో ఉండే అధిక మొత్తంలోని వివిధ రకాల ప్రోటీన్లు ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని (Skin beauty) కూడా పెంచుతాయి.
 

910

టమోటా: టమోటాలో (Tomato) ఉండే విటమిన్ ఎ, ఇ వంటి ఇతర పోషకాలు (Nutrients) చర్మానికి మంచి ఫలితాలను అందిస్తాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలను తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. దీంతో వయసు పైబడటంతో వచ్చే ముడతలు, మచ్చలు తగ్గిపోయి యవ్వనంగా కనిపిస్తారు.
 

1010

అంతేకాకుండా వీటితో పాటు ప్రతిరోజూ ఎండు  ద్రాక్ష, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం వంటి ఫలాలతో పాటు ఆకుకూరలను (Green leaf vegetables) ఎక్కువగా తీసుకోవాలి.  అలాగే రోజులో కొద్ది సమయం వ్యాయామం (Exercise), యోగా చేయడం మంచిది.

click me!

Recommended Stories