diabetes
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ డయాబెటిస్ కూడా ఎన్నో రోగాలకు కారణమవుతుంది. మీకు తెలుసా? దీన్ని పూర్తిగా నయం చేసుకోలేం. కేవలం నియంత్రించగం అంతే. మధుమేహం ఒకసారి వచ్చిందంటే మనం బతికున్నంత వరకు ఉంటుంది. ఈ రోగాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే లేనిపోని రోగాలు వస్తాయి.
diabetes
డయాబెటీస్ వ్యాధిని మందులు, జీవన శైలి ద్వారా నియంత్రణలో ఉంచొచ్చు. దీనికంటే ముందు అసలు డయాబెటీస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అయితే డయాబెటీస్ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి వారసత్వంగా. ఇలా టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. రెండోది మన జీవనశైలి వల్ల వస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణమవుతుంది. టైప్ 1 డయాబెటీస్ రాకుండా ఆపలేం. కానీ టైప్ 2 డయాబెటీస్ రాకుండా మాత్రం ఆపొచ్చు. టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
diabetes
శరీర బరువు
స్థూలకాయం, ఊబకాయం ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ వయస్సు, ఎత్తును బట్టి మీ బరువును అదుపులో ఉంచుకోండి. అధిక బరువు గుండెపోటు, స్ట్రోక్ తో పాటుగా ఎన్నో రోగాలకు దారితీస్తుంది కూడా.
చెకప్ లు
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కూడా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటే ఆహారంతో సహా మన జీవనశైలి గురించి జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది మధుమేహాన్ని నివారిస్తుంది.
diabetes
ధూమపానం
ధూమపానం ఎన్నో ప్రమాదకరమైన రోగాలను కలిగిస్తుందన్న ముచ్చట చాలా మందికి తెలుసు. ధూమపానం క్యాన్సర్ ప్రమాదాన్నే కాదు డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే స్మోకింగ్ అలవాటును వీలైనంత తొందరగా మానడానికి ప్రయత్నించండి.
diabetes diet
వాటర్
మన శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలంటే మనం నీటిని పుష్కలంగా తాగాలి. నీటిని సరిగ్గా తాగకపోతే మన ఆరోగ్యం ఎన్నో విధాలుగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల మీ శరీరం డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా డయాబెటిస్ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
diabetes diet
ఆహారం
మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా మధుమేహం ముప్పు ఎంతో ఉంది. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే. మీరు తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది మీరు డయాబెటిస్ తో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే సమతుల్యమైన, పోషకాలన్నీ ఉన్న ఆహారాన్ని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. సాధ్యమైనంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ను తినకుండా ఉండండి.