మారిన జీవనశైలి వల్ల చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. నిజమేంటంటే.. ఈ ఊబకాయం ఎన్నో ప్రాణాంతక రోగాల బారిన పడేస్తుంది. అధిక రక్తపోటు, గుండె జ్బబులు, డయాబెటీస్ వంటి ఎన్నో రోగాలు వస్తాయి. అయితే బరువు తగ్గేందుకు ఎన్నో డైట్ ప్లాన్లు ఉన్నాయి. వీటికంటే ముందు మీరు బరువు తగ్గడానికి చేయాల్సిన మొదటి పని ఆరోగ్యకరమైన ఆహారాలనే తీసుకోవడం. మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలంటే కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. కేలరీలు తక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. అయితే కొన్ని డ్రింక్స్ కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..
గ్రీన్ టీ
గ్రీన్ టీ లో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే గ్రీన్ టీ ని తాగడం వల్ల బరువు తగ్గుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఉదయాన్నే పరిగడుపున గ్రీన్ టీ ని తాగండి. ఈ గ్రీన్ టీ మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అల్లం టీ
బరువు తగ్గడానికి అల్లం టీ కూడా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఇది దగ్గు, జలుబు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.
chia seeds water
చియా వాటర్
చియా విత్తనాలు, నిమ్మకాయ నీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. లెమన్ వాటర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ డ్రింక్ ను తయారు చేయడానికి ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. రుచి కోసం మీరు దీనిలో ఒక చెంచా తేనెను కూడా వేసుకోవచ్చు. దీనిలో కొన్ని చియా సీడ్స్ ను వేయండి. ఇవి మీ ఆకలిని తగ్గిస్తాయి. కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.