ఇలా చేస్తే మీ పాదాలు పగలనే పగలవు

Published : Jul 23, 2023, 12:41 PM IST

పాదాల్లో ఆయిల్ కంటెంట్ తగ్గినప్పుడు చర్మం పొడిబారుతుంది. దీంతో మడమల చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య రానేరాదు.   

PREV
18
ఇలా చేస్తే మీ పాదాలు పగలనే పగలవు
cracked heels

పాదాలు పగిలిపోవడం చాలా మందిని వేధించే సాధారణ సమస్య. పాదాల్లో ఆయిల్ కంటెంట్ తగ్గినప్పుడే చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. అయితే ఎక్కువ సేపు నిలబడటం వల్ల కూడా పాదాలు పగుళ్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చు. పాదాలు పగలకుండా ఉండటానికి, అందంగా కనిపించడానికి వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. అందుకే మీ మీ పాదాలను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. పాదాలు పగుళ్లు రాకుండా ఉండాలంటే ఇంట్లోనే చేయాల్సిన కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

28

గంజి వాటర్

పాదాలు పగుళ్లు రాకుండా ఉండటానికి గంజి నీరు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొద్దిగా గంజి నీళ్లలో తేనె, కొద్దిగా వెనిగర్ కలిపి ద్రావణాన్ని తయారు చేయండి. తర్వాత మీ పాదాలను అందులో10 నిమిషాల పాటు ముంచండి.
 

38

అరటిపండ్ల గుజ్జు

అరటిపండ్లను గుజ్జును పాదాల కు మర్దన చేస్తే కూడా పదాలా పగుళ్లు రావు. పగుళ్లు రాకుండా ఉండాంటే అరటిగుజ్జును పాదాల పగుళ్లకు అప్లై చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పాదాల పగుళ్లు రాకుండా ఉంటాయి. పగుళ్లు కూడా తగ్గిపోతాయి.
 

48

గోరువెచ్చని నీటిలో ఉప్పు

పాదాల పగుళ్లు రాకుండా ఉండటానికి ఉప్పు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో పాదాలను ముంచండి. దీన్ని 20 నిమిషాల వరకు అలాగే ఉంచండి. 
 

58

నిమ్మరసం

గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేసి అందులో పాదాలను ముంచండి. ఆ తర్వాత నిమ్మరసాన్ని మీ పాదాలకు రుద్దండి.  ఇలా చేసినా పగుళ్లు రాకుండా ఉంటాయి. 
 

68

రోజ్ వాటర్

గ్లిజరిన్, రోజ్ వాటర్, కొద్దిగా నిమ్మరసాన్ని బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పాదాలు అందంగా కనిపిస్తాయి. పగుళ్లు కూడా రావు. 

78

బేకింగ్ సోడా

గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా, ఉప్పు వేసి మీ పాదాలను 15 నిమిషాల పాటు నానబెట్టండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే  మంచి ఫలితం ఉంటుంది.
 

నిమ్మరసంలో మజాస్ 

నిమ్మరసాన్ని పాదాలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే పగుళ్లు రాకుండా ఉంటాయి. అలాగే ఉన్న పాదాల పగుళ్లు కూడా తగ్గిపోతాయి. 
 

88

షాంపూ

గోరువెచ్చని నీటిలో షాంపూ వేసి అందులో నాలుగు చుక్కల నిమ్మరసాన్ని కలిపి మీ పాదాలను అందులో ముంచండి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల పాదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories