సమోసాలు తింటే ఏమౌతుందో తెలిస్తే వాటి జోలికే వెళ్లరు..

First Published May 22, 2024, 1:29 PM IST

సమోసాలను చూస్తే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. వీటి టేస్ట్ ఆ లెవెల్ లో ఉంటుంది మరి. కానీ సమోసాలు నోటికి రుచిగా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం అంత మంచివి కావు. అవును సమోసాలను తింటే మీరు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. 

జిలేబీ, సమోసాలను తినని వారు ఎవరూ ఉండరు. అయితే చాలా మంది సమోసాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో, లేదా టీ తో పాటుగా తింటుంటారు. ఇండియాలో సమోసాలు చాలా ఫేమస్. వీటి రుచి అద్బుతంగా ఉంటుంది. అందుకే చాలా మంది సమోసాలను రోజూ తింటుంటారు. కానీ సమోసాలు రుచిగా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం అంత మంచివి కావు. అవును సమోసాలను తింటే మీరు ఊహించని అనారోగ్య సమస్యలు బారిన పడాల్సి వస్తుంది. అసలు సమోసాలను తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గుండె జబ్బులు

సమోసాలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. అందుకే వీటిలో కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ నూనె ఎక్కువగా తినడం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. సమోసా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ ను తినడం వల్ల హార్ట్ పేషెంట్లకు విషం లాంటిదే. 
 

అధిక కొలెస్ట్రాల్ 

ఎక్కువ జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాన్ని తినడం వల్ల గుండె సిరల్లో కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోతుంది. ఇది సిరలలో అడ్డంకిని కలిగిస్తుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని కూడా చాలా పెంచుతుంది. రోజూ నూనె, వేయించిన ఆహారాలను తింటే మీ శరీరం రోగాలకు నిలయంగా మారుతుంది. 
 

బరువు పెరగడం

సమోసాలను ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం కూడా చాలా ఉంది. ఎందుకంటే సమోసాలను పిండితో తయారచేస్తారు. పిండిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇది పేగులను దెబ్బతీస్తుంది. పిండి ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
 

ఫుడ్ పాయిజనింగ్ 

బయట ఫుడ్ ను ఇంట్లో తయారుచేసినట్టు నీట్ గా తయారుచేసేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఏవేవో ముట్టుకుని తినే ఆహారాలను తయారుచేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆహారంలో క్రిములు, బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలను కలిగిస్తాయి. 

అధిక రక్తపోటు 

శుద్ధి చేసిన పిండి, బంగాళాదుంపలతో తయారుచేసిన సమోసాల్లో  కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిలో ఎక్కువ మొత్తంలో వెన్న, ఉప్పు కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే సమోసాలను తింటే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది. అధిక రక్తపోటు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

Latest Videos

click me!