భోజనం చేయట్లేదా? దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?

First Published May 27, 2023, 1:00 PM IST

తినడానికి సమయం లేక కొందరు, తినాలనిపించక మరికొందరు, బరువు పెరిగిపోతామని ఇంకొందరు భోజనాన్ని చేయడం మానేస్తారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. 
 

బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్..  ఇవన్నీ మనం శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరం. కానీ మనలో  చాలా మంది మూడు పూటలా తినరు. ఏదో ఒకదాన్ని మిస్ చేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నిజానికి భోజనం స్కిప్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు భోజనాన్ని ఎక్కువగా స్కిప్ చేస్తుంటారు. లేదా కొంతమందికి భోజనం చేసే సమయం ఉండదు. భోజనాన్ని స్కిప్ చేస్తే తొందరగా బరువు తగ్గుతామని చాలా మంది అపోహపడిపోతుంటారు. తినడానికి సమయం లేకపోవడం చాలా సాధారణ సమస్య. కానీ భోజనం మానేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే.. 

Image: Getty Images

ఆకలి పెరుగుతుంది

భోజనాన్ని స్కిప్ చేయడం వల్ల మీ ఆకలి పెరుగుతుంది. అతిగా తినే అవకాశం ఉంది. మీరు భోజనం మానేసినప్పుడు లేదా తినకుండా ఎక్కువసేపు  ఉన్నప్పుడు మీ శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. ఇది మీ కణాలు, శరీరం ఆహారాన్ని ఇంకా ఎక్కువగా కోరుకునేలా చేస్తుంది. ఇది మీరు చాలా తినడానికి కారణమవుతుంది. సాధారణంగా దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారాన్నే కోరుకుంటారు. ఇది మీ శరీర బరువును పెంచడమే కాకుండా ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. 

జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది

క్రమం తప్పకుండా భోజనం చేయడం మానేయడం వల్ల మీ వ్యవస్థను ఆకలి మోడ్ లోకి మారుస్తుంది. ఇది శక్తిని నిల్వ చేయడానికి మీ శరీరం చేసే ప్రయత్నం. అయినప్పటికీ..  బ్రేక్ ఫాస్ట్ లేదా రాత్రి భోజనం తినకపోవడం వల్ల మీ మొత్తం జీవక్రియ తగ్గుతుంది. బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. 
 

Hangry Bird

ఎప్పుడైనా భోజనాన్ని మానేసినప్పుడు మీ మెదడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా అనిపించిందా? అలాగే  ప్రతిదీ లేదా ఏదైనా చికాకును కలిగించిందా? అయితే మీరు Hangry Bird అయినట్టే. ఎందుకంటే భోజనం స్కిప్ చేయడం.. తక్కువ ప్రేరణ, శక్తి స్థాయిలు, బలహీనమైన అభిజ్ఞా పనితీరుతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు. భోజనాన్ని స్కిప్ చేసినప్పుడు శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ ను ఉత్పత్తిని పెంచడం ప్రారంభిస్తుంది. ఇది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది.
 

Image: Getty

హార్మోన్ల మార్పులు

భోజనం స్కిప్ చేయడం వల్ల మీ శరీరం ఆకలితో ఉందని భావించి.. ఒత్తిడి కారణంగా మీ కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. కార్టిసాల్ స్థాయిలు  ఎక్కువగా ఉంటే బరువు పెరిగిపోతారు. మీ రోగనిరోధక పనితీరు దెబ్బతింటుంది. వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా మారుతాయి. 
 


పోషకాహార లోపం

మీరు క్రమం తప్పకుండా భోజనాన్ని మానేస్తే మీరు తినాల్సిన దానికంటే తక్కువ తింటున్నారని అర్థం. ఇది మీరు పోషకాలను తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని వివిధ రకాల పోషక లోపాలకు గురి చేస్తుంది. పోషక లోపం ఎన్నో రోగాలకు  దారితీస్తుంది. 
 

click me!