ఆ రోగాలు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చేలా చేస్తయ్ జాగ్రత్త..

Published : May 27, 2023, 12:14 PM IST

ప్రస్తుతం చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే ఈ వ్యాధి ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించొచ్చు.   

PREV
17
ఆ రోగాలు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చేలా చేస్తయ్ జాగ్రత్త..
fatty liver

ఫ్యాటీ లివర్ లేదా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ఎలాంటి లక్షణాలను చూపించదు. అందుకే చాలా మంది ఈ వ్యాధి ముదిరినంకనే హాస్పటల్ కు వెళుతుంటారు. ఈ వ్యాధికి చికిత్స తీసుకోకపోతే కాలేయం వాపు వస్తుంది. దీనిని వైద్యపరంగా స్టెటోహెపటైటిస్ అంటారు. దీంతో కాలేయంలోని కొవ్వు నిల్వలు శరీరానికి ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయి. 

27
fatty liver

స్టెయాటోహెపటైటిస్ లో ఏం జరుగుతుంది?

స్టీటోహెపటైటిస్ లేదా నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఇది కాలేయం వాపు, మచ్చలకు దారితీస్తుంది. వృద్ధాప్యం, డయాబెటిస్ వంటి ప్రమాద కారకాలు ఈ సమస్యను మరింత దిగజార్చుతాయి. లేదా ఈ సమస్యను కలిగిస్తాయి. అసలు ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు వస్తుందంటే? 
 

37
fatty liver

అధిక బరువు

అధిక బరువు గుండెపోటు నుంచి ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. అంతేకాదు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి ఓవర్ వెయిట్ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే బాడీ మాస్ ఇండెక్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. బీఎంఐ 25 కంటే ఎక్కువగా ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

47
fatty liver

డయాబెటిస్

డయాబెటిస్ కొవ్వు కాలేయ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో కనీసం సగం మందికి నాన్ ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి ఉందని మాయోక్లినిక్ వెల్లడించింది.  టైప్ 2 డయాబెటిస్ లో కొవ్వు కాలేయ వ్యాధి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీకు టైప్ 2 డయాబెటీస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచండి. ఎందుకంటే ఇది కొవ్వు కాలేయ వ్యాధిని మరింత దిగజారుస్తుంది.

57
fatty liver disease

అధిక ట్రైగ్లిజరైడ్స్ స్థాయి

అధిక ట్రైగ్లిజరైడ్స్ స్థాయి నాన్ ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధితో సంబంధం కలిగుంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య నివేదికల ప్రకారం.. అధిక ట్రైగ్లిజరైడ్ మీకు ఇప్పటికే కొవ్వు కాలేయ వ్యాధి ఉందని సూచిస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయి 150 మి.గ్రా / డిఎల్ కంటే ఎక్కువగా పరిగణించబడుతుంది.

67
fatty liver

చెడు ఆహారపు అలవాట్లు

కాలేయంలో కొవ్వులు పేరుకుపోవడానికి చెడు ఆహారం కూడా కారణమేనంటున్నారు నిపుణులు. లేట్ గా తినడం, భోజనాన్ని స్కిప్ చేయడం, ఎక్కువ గ్యాప్ లేకుండా తినడం కాలేయంపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది కొవ్వు కాలేయ ప్రమాదాన్ని పెంచుతుంది.

77

స్లీప్ అప్నియా

ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. స్లీప్ అప్నియా కూడా కొవ్వు కాలేయానికి కారణమవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఇన్సులిన్ నిరోధకత, డైస్లిపిడెమియా, మంటను పెంచుతుంది. ఇది నాన్ ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధిని ప్రేరేపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories