ప్రస్తుత కాలంలో చర్మ క్యాన్సర్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ చర్మ క్యాన్సర్ కు ప్రధాన కారణం సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు. సూర్యుని అతినీలలోహిత కిరణాల ద్వారా కణాల డీఎన్ఏ నాశనం అవుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలలోని డీఎన్ఎను నాశనం చేస్తాయి. ఇది కణాల అనియంత్రిత పెరుగుదల, క్యాన్సర్ అభివృద్ధికి కారణమయ్యే ఉత్పరివర్తనాలకు దారితీస్తుంది. చర్మం రంగు మారడం, వైకల్యం, చర్మ గాయాలు, చిన్న మచ్చలు, చర్మపు పూతలతో చర్మ క్యాన్సర్ ను గుర్తించొచ్చు. చర్మ క్యాన్సర్ రాకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..