బరువు తగ్గడానికి డైటింగ్ కంటే 12 గంటల ఉపవాసమే బెటర్.. ఎందుకంటే?

First Published | Aug 24, 2023, 9:43 AM IST

బరువు తగ్గాలని డైటింగ్ చేసేవారు చాలా మందే ఉంటారు. కానీ బరువు తగ్గాలనుకునేవారికి డైటింగ్ కంటే ఉపవాసమే బెటర్ అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దీనివల్ల మీరు తొందరగా బరువు తగ్గుతారు.

ఎక్కువ సేపు ఉపవాసం ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే చాలా మంది ఆకలికి తట్టుకోలేరు. అలా అని తింటూ పోతే విపరీతంగా బరువు పెరుగుతారు. బరువును కంట్రోల్ లో ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ 12 గంటల పాటు ఉపవాసం ఉంటే మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు తిన్న తర్వాత సరిగ్గా 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. దీర్ఘకాలిక అడపాదడపా ఉపవాసానికి బదులుగా మీరు 12 గంటల పాటు ఉపవాసం ఉంటే చాలా సులువుగా బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. 
 


12 గంటల అడపాదడపా ఉపవాసం అంటే ఏంటి? 

నిపుణుల ప్రకారం.. 12 గంటల అడపాదడపా ఉపవాస పద్ధతిలో మీ మొత్తం భోజనాన్ని 12 గంటల్లో తినాలి. ఇక ఆ రోజు మిగిలిన 12 గంటల పాటు ఉపవాసం ఉండాలి. ఉదాహరణకు మీరు రాత్రి 8 గంటలకు డిన్నర్ చేస్తే మరుసటి రోజు ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ తినాలి. ఈ మధ్యలో ఎలాంటి ఫుడ్స్ ను తినకూడదు. ఈ ఉపవాసంలో ఎక్కువ భాగం రాత్రికి రాత్రే ముగుస్తుంది. 
 

Latest Videos



దీనిని ఎలా నిర్వహించాలి? 

నిపుణుల ప్రకారం.. మీ భోజన సమయాన్ని బట్టి అడపాదడపా ఉపవాసం కోసం టైం ను సెట్ చేసుకోండి. మీరు ఉదయాన్నే డిన్నర్ తింటే మరుసటి రోజు ఉదయం అదే సమయానికి తినాలి. ఆలస్యంగా తింటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఉపవాసం ఉండాలి. నీటిని ఎక్కువగా తాగాలి. ఇది తలనొప్పి, మైకము, చెడు శ్వాస, అలసట వంటి అడపాదడపా ఉపవాసం వల్ల కలిగే ఎన్నో దుష్ప్రభావాలను నివారించడానికి సహాయపడుతుంది. దీనిలో మీ భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి. పోషకాలు ఎక్కువగా ఉండే, మంచి నాణ్యత కలిగిన ఆహారాన్నే తినండి. 
 

నిపుణుల ప్రకారం.. మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించకపోతే మీకు మైకంగా అనిపిస్తుంది. శక్తి ఎప్పుడూ తగ్గుతుంటే, మీకు అలసట లేదా అనారోగ్యం అనిపిస్తే ఉపవాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఎక్కువ తినాలి లేదా తక్కువ తినాలి. క్రమంగా ఈ మార్పును అలవాటు చేసుకోండి. 

12 గంటల ఉపవాసం ఎలా పనిచేస్తుంది? 

12 గంటల అడపాదడపా ఉపవాసం రెండు కారణాల వల్ల బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది. మొదటిది.. ఇది కేలరీల కొరతను కలిగిస్తుంది. మీరు బర్న్ చేసే దానికంటే తక్కువ కేలరీలు తినడం వల్ల బరువు తగ్గుతారు. రెండోది.. మీరు 12 గంటల పాటు ఉపవాసం ఉన్నప్పుడు.. శరీరం కొవ్వు రూపంలో నిల్వ చేసిన శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కీటోసిస్ అంటారు. ఈ కొవ్వును ఉపయోగించడం వల్ల బరువు తగ్గొచ్చు.

Fasting

ఖచ్చితంగా బరువు తగ్గుతారా? 

12 గంటల ఉపవాసం తర్వాత మీరు పరిమిత సమయానికే తింటారు. అందుకే మీరు హెల్తీ ఫుడ్ ను తినాలి. అయినప్పటికీ 12 గంటల ఉపవాసం నేరుగా బరువు తగ్గడానికి దారితీయదు. అయితే ఈ డైట్ రూల్ ను ఎక్కువ రోజులు సేపు ఫాలో అవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎలా అంటే12 గంటల ఉపవాసాన్ని ప్రారంభిస్తే మీరు ఉపవాసంతో సౌకర్యవంతంగా ఉంటారు. దీని తర్వాత 14, 16 లేదా 18 గంటలు ఉపవాసం మీకు పెద్ద సమస్యగా అనిపించదు. 

అందరికీ సురక్షితం కాదు 

బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువగా ఉంటే.. తినే రుగ్మత లేదా 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు.. ఏదైనా సమస్య లేదా ఏదైనా ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకునే వారికి ఈ రకమైన ఉపవాసం ప్రయోజనకరంగా ఉండదు. అసలు వీరు ఇలాంటి ఉపవాసాన్నే ఉండకూడదు. గర్భధారణ సమయంలో 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఉపవాసం ఉండటం మంచిది కాదు. తల్లిపాలు ఇచ్చేవారు, గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ ఉపవాసం ఉండకూడదు. 

click me!