Health Tips: లెగుస్తూనే ఒంటినొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఒకసారి మీ బెడ్ చెక్ చేసుకోవాల్సిందే?

Published : Aug 16, 2023, 12:34 PM IST

Health Tips: మీరు ఉదయం నిద్ర లేవగానే కాళ్లు చేతులు నొప్పిగా అనిపిస్తున్నాయా.. పడుకునేటప్పుడు వెన్ను నొప్పిగా అనిపిస్తుందా.. అయితే కచ్చితంగా మీ బెడ్ మార్చాల్సిందే. బెడ్ గురించి ఇంకా  ఎక్కువ సమాచారం తెలుసుకుందాం.  

PREV
16
Health Tips: లెగుస్తూనే ఒంటినొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఒకసారి మీ బెడ్ చెక్ చేసుకోవాల్సిందే?

బెడ్ మీద పడుకునేటప్పుడు తగినంత సహజమైన గాలి ఉండాలి. కొన్నిసార్లు వీపుతో సహా మొత్తం శరీరం వేడిగా అనిపిస్తుంది. ఇది పరుపు చేయడానికి ఉపయోగించే విప్కోలాస్టిక్ పాలియూరితేన్ అనే రసాయనం వల్ల వస్తుంది. అలాగే మంచం నుంచి చాలా సార్లు చెడువాసన వస్తుంది.
 

26

అయినా పట్టించుకోకుండా ఆ బెడ్ ని వాడుతూనే ఉంటాం. ఇలా చేయడం చాలా ప్రమాదం అదే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మీ పరుపు ఎనిమిది ఏళ్ల కంటే ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ పరుపులోని దుమ్ము, చమట కణాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
 

36

ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు పడుకునే పరుపు విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు మంచం ఏ పదార్థంతో రెడీ చేయబడిందో దాని మీద కూడా పరుపు లైఫ్ టైం ఆధారపడి ఉంటుంది. అలాగే పడుకునేటప్పుడు చేతులు, మేడ నొప్పిగా అనిపించినట్లయితే పరుగు దాని సామర్థ్యాన్ని కోల్పోయిందని అర్థం.

46

పరుపు అరిగిపోవడంతో అవి ఒత్తిడిని తగ్గించే లక్షణాలని కోల్పోతాయి. దీనివల్ల వెన్నెముక సమస్యలు, కీళ్ల  సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ కారణంగా మీరు నిద్రలేమికి గురవుతారు. అలా తరచుగా నిద్రలేమికి గురవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

56

సరియైన సమయంలో నిద్ర పోకపోతే చిరాకు అలసటతో పాటు శరీరంలోని ఉత్సాహం తగ్గి అలసటతో నిరసించిపోతారు. దీనివలన మానసిక ఒత్తిడి, విపరీతమైన తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది ఇంట్లో పరుపు రంగు మారటం అలాగే, పరుపులు మీద మచ్చలు మచ్చలుగా కనిపించిన కూడా పెద్దగా పట్టించుకోరు.
 

66

అదే బెడ్ ని వాడుతూ ఉంటారు దీనివలన తుమ్ములు, కళ్ళ నుంచి నీరు కారటం వంటి అలర్జీ సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి పరుపే కదా అని లైట్ తీసుకోకండి. పరుపు మీద కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే మంచి ఆరోగ్యం కోసం మంచి నిద్ర అవసరం.

click me!

Recommended Stories