బలహీనంగా అనిపించడం, కళ్లు పసుపు రంగులోకి మారడం, ముఖంపై మొటిమలు చికాకు కలిగించడం ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు. ఎన్సీబీఐ ప్రకారం.. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది దీని బారిన పడుతున్నారు. స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ కారణంగా ఇది వేగంగా వ్యాప్తిచెందుతోంది. కొవ్వు కాలేయంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్.