మార్నింగ్ సిక్ నెస్, వికారం నుంచి ఉపశమనం
మొదటి త్రైమాసికంలో ఉన్న, మార్నింగ్ సిక్ నెస్, వికారం ఎదుర్కొంటున్న గర్భిణీ స్త్రీలకు కరివేపాకులు ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులను తింటే మంచి అనుభూతి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు శరీరంలో జీర్ణ రసాలను పెంచుతుంది. ఇది వికారం, మార్నింగ్ సిక్ నెస్, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.