ముడి ఆహారాలు
ఆయుర్వేదం ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత ముడి ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి జీర్ణం కావడం చాలా కష్టం. సలాడ్లు, పచ్చి కూరగాయలు, పండ్లు వంటి ముడి ఆహారాలకు జీర్ణ శక్తి చాలా అవసరం. అందులోనూ వీటిని రాత్రిపూట తింటే కడుపు ఉబ్బరం, అజీర్థి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటికి బదులుగా కాల్చిన లేదా ఉడకబెట్టిన కూరగాయలు, ఉడకబెట్టిన పండ్లను తినండి.