అల్లం టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 20, 2024, 2:55 PM IST

చలికాలంలో ప్రతి ఒక్కరూ వేడి వేడి టీని ఎక్కువగా తాగుతుంటారు. ముఖ్యంగా చాలా మంది అల్లం టీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ దీన్ని రోజూ తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

చలికాలపు చలి ఇప్పటికే మొదలైంది. ఈ చల్లని వాతావరణం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతినడం స్టార్టవుతుంది. అందుకే చలికాలంలో మనం శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. దగ్గు, జ్వరం, జలుబు, ఫ్లూ, అంటువ్యాధులు వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఇలాంటి పరిస్థితిలో మనం ఆరోగ్యంగా ఉండానికి ఒక కప్పు వేడి వేడి అల్లం టీ కంటే బెస్ట్ డ్రింక్ ఏదీ ఉండదంటారు ఆరోగ్య నిపుణులు. నిజానికి అల్లం  టీ టేస్టీగా ఉండటమే కాదు.. ఇది మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది. 

అల్లం టీ లో మెగ్నీషియం, విటమిన్ సితో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ అల్లం టీ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అల్లం టీలో పాలను కలపకపోతే దీనిలోని ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి.

అయితే ఈ టీ మరింత టేస్టీగా అవ్వడానికి తేనె, నిమ్మరసం లేదా పుదీనాను కలపొచ్చు. మరి చలికాలంలో అల్లం టీని తాగితే ఎలాంటి  ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Latest Videos


పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం

చాలా మందికి పీరియడ్స్ సమయంలో భరించలేని కడుపు నొప్పి వస్తుంది. అలాగే కాళ్లు లాగడం, తిమ్మిరి, నెత్తినొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో మీరు ఒక కప్పు వేడి వేడి అల్లం టీని తాగితే ఈ సమస్యల నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది. అల్లంలో ఉండే లక్షణాలు నెలసిర మంటలను, నొప్పిని, తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

రక్తంలో చక్కెర నియంత్రణ

అల్లం టీ డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అల్లం టీ తాగితే ఇన్సులిన్ స్థాయిలు మెరుగుపడతాయి. అలాగే హిమోగ్లోబిన్ ఎ 1 సి,ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. ముఖ్యంగా అల్లం టీ టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. 
 

వ్యాధులు, అంటువ్యాధుల నుంచి రక్షణ

చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంటుంది. దీనివల్ల ఎన్నో జబ్బులు, అంటువ్యాధులు వస్తుంటాయి. ముందే ఈ చలికాలంలో జబ్బులు తొందరగా తగ్గవు. ఇలాంటి పరిస్థితిలో ఒక కప్పు అల్లం టీ మనకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఈ టీలో ఉండే పోషకాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి. 

మెదడు పనితీరును మెరుగుపడుతుంది

అల్లం టీ తాగితే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా మన మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అల్లంలో ఔషద లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని, మంటను తగ్గిస్తాయి. అల్లం టీ తాగితే  అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులొచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఇది మీ మెదడును ఆరోగ్యంగా, మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

మోషన్ సిక్ నెస్ నుంచి ఉపశమనం 

అల్లం టీ మోషన్ సిక్ నెస్ నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా సహాయపడుతుంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. మీకు వికారం, వాంతులు, మైకంగా, చల్లని చెమటలు పట్టడం వంటి సమస్యలు ఉంటే ఒక కప్పు వేడి వేడి అల్లం టీని తాగండి. ఈ సమస్యలన్నీ వెంటనే తగ్గిపోతాయి. 

Ginger water or tea

వికారం నుంచి ఉపశమనం 

మీరు ప్రెగ్నెంట్ గా లేదా కీమోథెరపీ లేదా శస్త్రచికిత్స చేయించుకున్నట్టైతే అల్లం టీని తాగండి. ఇది మీకు వికారం రాకుండా చేస్తుంది. వాంతులు కాకుండా చూస్తుంది. నిజానికి అల్లంలో ఉండే జింజెరోల్స్ గర్భం, కెమోథెరపీ లేదా శస్త్రచికిత్సతో సంబంధం ఉన్న వికారాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. 

click me!