ఉదర సమస్యలకు తులసి ఆకులు
తులసి ఆకుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, వంటి కడుపునకు సంబంధించిన ఎన్నో సమస్యలను తొందరగా నయం చేయడానికి సహాయపడతాయి.
జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది
తులసి ఆకులను తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావు. తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో జీర్ణప్రక్రియ సాఫీగా సాగుతుంది.