డిన్నర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Jul 6, 2024, 4:30 PM IST

భోజనం చేయడం మానేస్తే చాలు ఎంచక్కా బరువు తగ్గేయొచ్చు అని చాలా మంది అనుకుంటారు. దీన్నే నమ్ముతారు కూడా. కానీ రాత్రిపూట తినకుండా పడుకోవడం వల్ల మీకు ఎన్ని సమస్యలు వస్తాయో మీరు అస్సలు ఊహించలేరు. 
 

sleep

బరువు తగ్గడానికి భోజనం స్కిప్ చేసేస్తు చాలని చాలని చాలా మంది అనుకుంటారు. కానీ భోజనం మానేస్తే బరువు తగ్గుతారని ఎక్కడా చెప్పలేదు. నిజానికి భోజనం స్కిప్ చేయడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిజానికి ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎందుకంటే భోజనం స్కిప్ చేయడం వల్ల మీ శరీరంలో పోషకాలు తగ్గుతాయి. బరువు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ను మానేయడం వల్ల మీకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. 

ఎవరో చెప్పారని రాత్రిపూట భోజనం చేయడం మానేయకండి. ఎందుకంటే డిన్నర్ మీ రోజువారి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది మీ శరీరానికి అవసరమైన పోషకాలను, కేలరీలను  అందిస్తుంది. అలాగే మీరు అప్పుడప్పుడు భోజనం మిస్ చేయడం వల్ల మీకు ఎలాంటి హాని కలగదు. కానీ తరచుగా ఇలా చేశారంటే మాత్రం సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి భోజనం స్కిప్ చేయడానికి బదులుగా తేలికపాటి భోజనం చేయండి. 

Latest Videos


భోజనం మానేస్తే ఏం జరుగుతుంది?

భోజనం స్కిప్ చేస్తే బరువు తగ్గుతారనే అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు ప్రతిరోజూ భోజనం చేయాలి. 'రాజులా బ్రేక్ ఫాస్ట్ చేయాలి, పేదవాడిలా డిన్నర్ చేయాలనే' అనే సామెత మీరు వినే ఉంటారు. కానీ మీరు అనుకున్నదానికంటే అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉండే సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమంటారు నిపుణులు. 
 

ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి: భోజనం స్కిప్ చేయడం వల్ల మీ  శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. భోజనం చేయకపోవడం వల్ల మిమ్మల్ని శక్తివంతంగా ఉంచే కేలరీలు తగ్గుతాయి. దీంతో మీరు చిన్న పని చేసినా బాగా అలసిపోతారు. 

ఆకలి: లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత మీకు కడుపు నిండిన భావన కలిగి తినడం ఆపమని మీ మెదడు సంకేతం ఇస్తుంది. అయితే గ్రెలిన్ అనే హార్మోన్ మీరు ఆకలితో ఉన్నారని మీకు సంకేతం ఇస్తుంది. కానీ మీరు రాత్రిపూట భోజనం చేయకుంటే ఈ రెండు హార్మోన్లు సరిగ్గా పనిచేయవు. 
 

తీవ్రమైన ఆకలి:  ఆకలి లక్షణాలను విస్మరించడం, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల మీకు విపరీతమైన ఆకలి కోరికలు కలుగుతాయి. దీనివల్ల మీకు చక్కెర, కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవాలన్న కోరిక కలుగుతుంది. ఎందుకంటే అవి రెండూ మీకు శీఘ్ర శక్తిని ఇస్తాయి. 

క్రమరహిత జీర్ణక్రియ: రాత్రి భోజనం స్కిప్ చేయడం వల్ల మీకు వికారం, విరేచనాలు లేదా మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల మీరు భోజనాన్ని స్కిప్ చేయొచ్చు. లేదా అతిగా తినొచ్చు. ఈ రెండూ మీ ఆరోగ్యానికి మంచివి కావు. 

తినే రుగ్మత: భోజనం మానేసే వ్యక్తులు తినే రుగ్మతలకు గురవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంటే మీరు భోజనం స్కిప్ చేయడం వల్ల అనోరెక్సియా, బులిమియా లేదా ఆర్థోరెక్సియా వంటి రుగ్మతల ప్రమాదాల బారిన పడతారు. 

నిద్ర చక్రంతో సమస్యలు:  రాత్రి భోజనాన్ని స్కిప్ చేయడం వల్ల మీ నిద్ర చక్రం బాగా ప్రభావితం అవుతుంది. అలాగే మీరు కంటినిండా నిద్రపోలేరు. నిద్ర లేకపోవడం మీ రోగనిరోధక శక్తి, మానసిక స్థితి, శక్తి, జీవక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 

click me!