స్నానం చేసిన వెంటనే చెవిలోకి నీరు వెళ్ళటం వలన చెవి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే ఇయర్ బడ్స్ తీసి క్లీన్ చేసేస్తూ ఉంటాం. అలాగే చెవిలో ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే మనం మొదటి చేసే పని ఇయర్ బడ్స్ తో చెవిని క్లీన్ చేయడమే. మనమే కాదు మన పిల్లలకు కూడా మనం తరచుగా అదే పని చేస్తూ ఉంటాం.
కానీ అలా చేయటం ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. చెవిలో గులిమి తీయడం కోసం మనం కాటన్ బడ్స్ ని యూస్ చేస్తాం. కానీ వాటిని వాడటం వలన గులిమి మరింత లోపలికి వెళ్తుంది. జిగటగా మెత్తగా ఉండే ఈ పదార్థం గట్టిగా మారిపోయి చెవికి అడ్డంగా మారవచ్చు.
దీనివల్ల వినికిడి లోపం లేదంటే శాశ్వతంగా వినిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే చెవి పోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.కాటన్ బడ్స్ వాడటం వలన చెవుల్లో దురద కాస్త తగ్గినట్లు అనిపించినా గులిమి శుభ్రపడదు.
అలాగే కాటన్ బడ్స్ వాడటం వల్ల చెవి బయటనుంచి వచ్చే బ్యాక్టీరియా కూడా గులిమిపై చేరి మీ చెవులకు హాని కలిగిస్తుంది. కాటన్ బడ్స్ తో పదేపదే కెలకటం వల్ల కర్ణభేరి దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి చెవులుని శుభ్రపరచడం కోసం ఇయర్ బడ్స్ ని వాడకుండా చాలా రకాలుగా చెవిని క్లీన్ చేసుకోవచ్చు. సిరంజి ని ఉపయోగించి చెవిలో నీటిని పంపించవచ్చు. ఈ నీటితో చెవులు శుభ్రపడతాయి.
అలాగే చెవులను క్లీన్ చేసేందుకు మార్కెట్లో ఓవర్ ది కౌంటర్ క్లీనింగ్ డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. సహజమైన పద్ధతులలో వీటిని తయారు చేస్తారు వీటిని చెవిలో వేసుకుంటే చెవులు క్లీన్ అవుతాయి.