పెరుగులో విటమిన్ బి 2, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ పెరుగును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే తుమ్ములు, జలుబు వంటి అలెర్జీ వ్యాధుల ముప్పు కూడా తప్పుతుంది. మీరు రోజూ పెరుగును తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే కడుపు అసౌకర్యం కూడా తగ్గుతుంది. అంతేకాదు పెరుగు మీ కడుపు, ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.