HealthTips: గ్యాస్ ట్రబుల్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సరైన ఆహార పద్ధతులు పాటించకపోవడం వల్ల ఈ ట్రబుల్ వస్తుంది. అయితే తాత్కాలిక ఉపశమనం కోసం ఇంట్లో ఉండే వస్తువులతోనే గ్యాస్ ఇబ్బంది నుంచి ఉపశమనం పొందవచ్చు అది ఎలాగో చూద్దాం.
సాధారణంగా గ్యాస్ సమస్య మంచి ఆహారం తీసుకోకపోవడం, టైం కి ఆహారం తీసుకోకపోవడం, అలాగే సరైన నిద్ర లేకపోవడం వల్ల తిన్నది అరగకపోవటంవలన గ్యాస్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. లాక్టోస్ అసహనము, గ్లూటన్ సెన్సిటివిటీ, చాలా కృత్రిమ స్వీటెనర్ ఆధారిత ఆహారాలు తినటం.
26
సాఫ్ట్ డ్రింక్స్, సోడాలు తాగడం వంటి ఇతర కారకాలు జీర్ణవ్యవస్థలో గణనీయమైన గ్యాస్ ని కలిగిస్తాయి. దీనివలన దడ, కడుపు ఉబ్బిపోవడం, చాతిలో నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటివారు తాత్కాలిక ఉపశమనం కోసం గోరువెచ్చని నీరు తాగండి.
36
లేదా మీకు అందుబాటులో ఉంటే హెర్బిల్ టీలు తాగండి. అవి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. అలాగే కొబ్బరినీరు, సోంపు వాటర్ కూడా మంచి రిలీఫ్ ని ఇస్తుంది. జీర్ణ సమస్యలకు మరొక ఇంటి నివారిణి అల్లం. ఇందులో ఉండే యాన్ఫ్లమేటరీ గుణాలు, గ్యాస్ యాసిడ్ రిఫ్లెక్స్ గుండెల్లో..
46
మంట నుంచే ఉపసమనం పొందడంలో సహాయపడతాయి. దీన్ని టీ రూపం గాను, కషాయం రూపంలోనూ తాగటం వల్ల ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చిన దగ్గరనుంచి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. పాలు, పాల పదార్థాలు, కార్బోనేటెడ్ పానీయాలు..
56
సోడాలు వంటివి మీ ఆహారంలో ఉండకుండా చూసుకోండి. అలాగే శారీరకంగా చురుకుగా ఉండటం, జీర్ణ ఆరోగ్యానికి కీలకం వాకింగ్, స్విమ్మింగ్, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామ పద్ధతిలో మీరు గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు.
66
ఇది మీ చాతి నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే మసాలా దినుసులని కూడా మీ ఆహారం నుంచి తొలగించండి. భోజనం విషయంలో సమయపాలన పాటించండి దీని వలన వీలైనంతవరకు గ్యాస్ సమస్యలను దూరంగా ఉంచవచ్చు.