కాఫీ వల్ల మిశ్రమ ప్రయోజనాలు ఉన్నాయి. పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన అణువులు. యాంటీ ఆక్సిడెంట్లు టైప్ -2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ దీన్ని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాఫీని మోతాదులో తాగితే దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు జరగవు. కాఫీని ఎక్కువగా తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం నుంచి నిద్రలేమి, నిర్జలీకరణం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.