పల్లీలను తీసుకుంటే స్ట్రెస్ తగ్గుతుందా... నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Navya G   | Asianet News
Published : Jan 09, 2022, 01:59 PM IST

పల్లీలను వేరుశెనగలు (Peanuts) అని కూడా అంటారు. వేరుశెనగను సామాన్యుడు జీడిపప్పుగా వ్యవహరిస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి శరీర ఆరోగ్యంతో పాటు సౌందర్య పోషణలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి. మరి పల్లీలను తీసుకుంటే ఆందోళన (Anxiety) సమస్యలు ఎలా తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
18
పల్లీలను తీసుకుంటే స్ట్రెస్ తగ్గుతుందా... నిపుణులు ఏం చెప్తున్నారంటే?

మానవ శరీరం ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కోవడానికి ప్రధానకారణం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు (Nutrients) లేకపోవడం. కనుక మనం తీసుకునే ఆహార జీవనశైలిలో పోషకాలు కలిగిన పదార్థాలను చేర్చుకోవడం మంచిది. అప్పుడే శరీరానికి కావలసిన శక్తి లభించి శరీరం ఒత్తిడి (Stress), ఆందోళన వంటి సమస్యలను తట్టుకుంటుంది.

28

నూరు గ్రాముల పల్లీలలో  సుమారు 567 కేలరీల శక్తి లభిస్తుంది. 21 గ్రాముల పిండి పదార్థాలు (Carbohydrates), 25 గ్రాముల  ప్రోటీన్లు, 48 గ్రాముల కొవ్వు, 9 గ్రాముల పీచు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి చేయడానికి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడుతాయి.
 

38

పల్లీలు ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులు (Proteins), అమైనో ఆమ్లాలు (Amino acids) ఉంటాయి. ఇది కండరాల ఆరోగ్యానికి సహాయ పడతాయి. వీటితో పాటు మంచి కొవ్వు పదార్థాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. విటమిన్ ఇ, సి కూడా సమృద్ధిగా ఉంటాయి.

48

ఇవి చర్మ సంరక్షణతో (Skin care) పాటు జుట్టు సౌందర్యానికి (Hair beauty) కూడా సహాయపడతాయి. పల్లీలలోని ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఒత్తిడి, ఆందోళన సమస్యలను తగ్గిస్తాయి. పల్లీలలో ఉండే పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
 

58
peanuts

ఈ హై ప్రోటీన్ (High protein) గింజలను తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా మారుతాయి. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్ శరీరంలోని అనేక వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతాయి. పల్లీలను ఆరు గంటల పాటు నానబెట్టుకుని తీసుకుంటే తేలికగా జీర్ణమవుతాయి (Digested).

68

పల్లీలలో ఉండే ప్రోటీన్లు, పీచు పదార్థాలు శరీరానికి కావల్సిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి వ్యాధినిరోధక శక్తిని (Immunity) పెంచుతాయి. పల్లీలలో కొలెస్ట్రాల్ శాతం తక్కువ. కనుక వీటిని తీసుకుంటే గుండె జబ్బులు (Heart diseases) తగ్గుతాయి. పచ్చి వేరుశనగ పప్పులు తింటే శరీరానికి మంచి ఫలితం లభిస్తుంది.
 

78

పల్లీలలో మెగ్నీషియం (Magnesium), పాస్పరస్ (Phosphorus) అధికంగా ఉంటుంది. ఇవి శరీర కండరాల నిర్మాణానికి సహాయపడతాయి. పల్లీలను తీసుకుంటే నిద్రలేమి సమస్యలు తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఫలితంగా ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి.

88

సాయంత్రం సమయంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, చిరుతిండ్లు బదులుగా ఉడికించిన  పల్లీలను తీసుకుంటే  పోషకాలను శక్తిని పొందవచ్చు. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉండవచ్చు. స్త్రీ, పురుషుల్లో శృంగార సమస్యలు తగ్గించి సంతానోత్పత్తికి (Fertility) సహాయపడుతాయి. కనుక రోజు గుప్పెడు పల్లీలను ఉడకబెట్టి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

click me!

Recommended Stories