ఈ ఒక్కటి చాలు... చుండ్రును మొటిమలను ఇట్టే తగ్గిస్తుంది.. అది ఏమిటంటే?

First Published Jan 20, 2022, 2:29 PM IST

ముల్లంగిలో (Radish) మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ, జుట్టు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతాయి. చర్మ సౌందర్యం కోసం ముల్లంగి ఫేస్ ప్యాక్స్ ను ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పుడు మనం ముల్లంగితో కలిగే బ్యూటీ బెనిఫిట్స్ (Beauty Benefits) గురించి తెలుసుకుందాం..
 

ముల్లంగి ఔషధ గుణాలను (Medicinal properties) కలిగి ఉంటుంది. ముల్లంగిలో విటమిన్ ఎ, సి, క్యాల్షియం పొటాషియం, పాస్ఫరస్, ప్రొటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు (Nutrients) పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇవి చర్మ, జుట్టు సౌందర్యం కోసం సహాయపడతాయి.
 

ముల్లంగి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మాన్ని శుభ్రపరిచి చర్మ సమస్యలను (Skin problems) నివారిస్తుంది. చర్మంపై ఏర్పడే మొటిమలు, మచ్చలను (Spots) తగ్గించడానికి సహాయపడుతుంది. వీటితో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను నివారించి చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది.
 

జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. చుండ్రు (Dandruff) వంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ నుంచి కాపాడి చర్మం నుండి మలినాలను, మురికిని తొలగిస్తుంది. ఇలా ముల్లంగి చర్మసౌందర్యం (Skin beauty) కోసం అందించే బ్యూటీ బెనిఫిట్స్ అనేకం.
 

మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది:  ఒక కప్పులో ఒక టీ స్పూన్ ముల్లంగి గింజల పొడిని (Radish seed powder) తీసుకొని అందులో కొన్ని నీళ్ళు వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం పైన మొటిమలు (Acne), మచ్చలు తగ్గుతాయి.
 

చర్మాన్ని తేమగా ఉంచుతుంది: ఒక కప్పులో తురిమిన ముల్లంగి (Grated radish), సగం టేబుల్ స్పూన్ పెరుగు (Yogurt), ఐదు చుక్కల బాదం నూనె (Almond oil) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకుంటే చర్మానికి కావలసిన తేమ అంది చర్మం తాజాగా ఉంటుంది.
 

బ్లాక్ హెడ్స్ తగ్గిస్తుంది: ముల్లంగిని తురుముకొని దాని నుంచి రసం తీసుకోవాలి. ఇప్పుడు ముల్లంగి రసాన్ని (Radish juice) కాటన్ బాల్స్ సహాయంతో ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరచుకోవాలి. ఇలాచేస్తే ముఖంపై బ్లాక్ హెడ్స్ (Blackheads) తొలగిపోయి చర్మం శుభ్రంగా ఉంటుంది.
 

చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది: ముల్లంగి రసాన్ని (Radish juice) తలకు అప్లై చేసుకుని టవల్ ను తలకు చుట్టుకోవాలి. గంట తర్వాత గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు (Dandruff) సమస్యలు తగ్గుతాయి. ఇలా కనీసం వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది: నల్ల ముల్లంగి రసాన్ని (Black radish juice) తలకు బాగా అప్లై చేసుకుని టవల్ ను తలకు చుట్టుకోవాలి. గంట తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు పెరుగుదల (Hair growth) బాగుంటుంది.

click me!