బెండకాయే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. బరువు నుంచి బ్లడ్ షుగర్ ను తగ్గడం వరకు ఎన్ని లాభాలున్నాయో..

First Published | Sep 23, 2023, 7:15 AM IST

బెండకాయ మంచి పోషకాహారం. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలుచేస్తుంది. కానీ చాలా మంది ఇది జిగటగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కానీ దీని ప్రయోజనాలను తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు. 

ఆరోగ్యంగా, ఎలాంటి రోగం లేకుండా బతకాలంటే మాత్రం ఆరోగ్యానికి మేలుచేసే మంచి పోషకాహారాన్ని తప్పకుండా తినాలి. పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. ప్రస్తుత కాలంలో ఎన్నో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. జనాలు ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆకుపచ్చ కూరగాయలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే ఆకుపచ్చని కూరగాయలను పుష్కలంగా తినాలని డాక్టర్లు చెబుతుంటారు. ఇలాంటి కూరగాయల్లో బెండకాయ ఒకటి. 

Image: Freepik

బెండకాయ పోషకాలకు బాంఢాగారం. కానీ చాలా మంది ఈ కూరగాయను తినడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే ఇది జిగటగా ఉంటుందని. కానీ ఈ కూరగాయ మనకు చేసే మేలు గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు. ఈ కూరగాయతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


Image: Getty Images

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ప్రస్తుత కాలంలో ఎన్నోరకాల వ్యాధులు, అంటువ్యాధులు బాగా పెరిగిపోయాయి. వీటితో హాస్పటల్ల చుట్టూ తిరుగుతున్న వారు ఎక్కువయ్యారు. మీకు తెలుసా? రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఈ వ్యాధుల బారిన పడతారు. ఇలాంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే బెండకాయను తరచుగా తినండి.  బెండకాయలోని పోషకాలు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడతాయి. 
 

మధుమేహానికి ఒక వరం

మన దేశంలో మధుమేహుల సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే మధుమేహులకు బెండకాయ ఒక వరమనే చెప్పాలి. ఎందుకంటే బెండకాయలో ఉండే యూజీనాల్ డయాబెటిస్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్  కంట్రోల్  లో ఉంటాయి. 

okra

బరువు తగ్గించడంలో

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. అలాగే బరువును తగ్గించడానికి సహాయపడే ఆహారాలను తినాలి. అయితే బెండకాయ బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. బెండకాయలో ఉండే యాంటీ ఒబేసిటీ గుణాలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
 

okra water


కళ్లకు మేలు 

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి చూపు తగ్గడమే కాకుండా కంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో మీ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బెండకాయను ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చండి. ఈ కూరగాయలో ఉండే ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును పెంచడానికి సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
 

Okra


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ప్రస్తుత కాలంలో జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ జీర్ణసమస్యల నుంచి ఉపశమనం పొందడానికి బెండకాయ ఎంతో సహాయపడుతుంది. అవును బెండకాయను తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. బెండకాయలో ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. 
 

Latest Videos

click me!