నిండు గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఏ ఆహారం తీసుకోకూడదు?

First Published | Oct 12, 2021, 5:14 PM IST

స్త్రీలు తాము గర్భం దాల్చినపట్టి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహార పదార్థాలలో మాత్రం తగిన పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి.

స్త్రీలు తాము గర్భం దాల్చినపట్టి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహార పదార్థాలలో మాత్రం తగిన పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి.
 

గర్భధారణ సమయంలో సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో ప్రత్యేకించి మహిళలు తమకే కాకుండా గర్భంలో పెరుగుతున్న శిశువుకు కూడా పోషకాహారం అందేలా జాగ్రతలు తీసుకోవాలి.
 


అప్పుడే పుట్టబోయే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ క్రమంలో గర్భంతో ఉన్న మహిళలు రోజు వారి ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు నీటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలను  తీసుకోవడం చాలా అవసరం.
 

ఇప్పుడు గర్భంతో ఉన్న స్త్రీలు తీసుకునే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ఎక్కువగా ఏర్పడుతుంది. ఇందుకు కారణం ఆహారం ద్వారా తగిన ఐరన్ అందక పోవడం.
 

అందుకు గోంగూర, బచ్చలి కూర మరియు తోటకూర వంటి ఆకుకూరలలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది మరియు బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

పాలు, పాల పదార్థాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాలు, పప్పులు, రాగులు, గోధుమలు, సెనగలు, బియ్యం, బంగాళాదుంపలు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు కలిగిన ఆహారం రోజు తీసుకోవాలి.                                  
 

ఇక గర్భధారణ సమయంలో తినకూడని ఆహార పదార్థాలు ఏంటంటే.. బొప్పాయి. బొప్పాయిని తీసుకోవడం వలన అధిక రక్తస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 

గర్భధారణ సమయంలో షుగర్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. మద్యం, కాఫీ, చైనీస్ ఆహార పదార్థాలు తీసుకోకూడదు.ఉడికి ఉడికించిన మాంసం, గుడ్లు తినకూడదు.
 

చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదైనా.. కొన్ని చేపలలో పాదరసం ఎక్కువగా ఉండడం వలన వాటిని తీసుకోకూడదు. అలాంటి చేపలు తినడం వలన శిశువు నాడీమండలం మీద పెద్ద ప్రభావం ఉండే అవకాశం ఉంది.

Latest Videos

click me!