తడిజుట్టు ముడి వేస్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసా?

First Published Oct 12, 2021, 4:35 PM IST

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి జుట్టు సమస్య బాగా ఇబ్బందిగా మారింది. ఎన్ని షాంపూలు వాడిన, మంచి మంచి ఆయిల్ పెట్టిన జుట్టు మాత్రం పెరగటం లేదు. పైగా వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయి. 

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి జుట్టు సమస్య బాగా ఇబ్బందిగా మారింది. ఎన్ని షాంపూలు వాడిన, మంచి మంచి ఆయిల్ పెట్టిన జుట్టు మాత్రం పెరగటం లేదు. పైగా వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయి. దీంతో చాలా మంది చిన్న జుట్టుగానే ఉంచుకుంటున్నారు.
 

చాలావరకు జుట్టు సమస్యలు షాంపూ, ఆయిల్ వల్లనే కాకుండా మన చేతులారా కూడా నాశనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తడి జుట్టును ముడి వేస్తే కొన్ని ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే 
 

ముఖ్యంగా చుండ్రు సమస్య కూడా జుట్టు రాలడానికి కారణం. ఇక తల స్నానం చేసినప్పుడు జుట్టును ముడి వేయడం వల్ల అప్పుడు వెంట్రుకలు బలహీనంగా మారుతాయట.
 

అంతేకాకుండా చెమట ద్వారా కూడా జుట్టు సమస్య బాగా ఎక్కువవుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు రాలి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
 

జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు, ముడి వెయ్యకూడదు. జుట్టు త్వరగా ఆరిపోవాలి అంటే కాటన్ వస్త్రం తో తుడుచుకోవాలి. తడి జుట్టును ఎప్పుడు పోనీటెల్ గా వేయకూడదు. గట్టిగా బిగించకూడదు. లేదంటే వెంట్రుకలు ఊడిపోతాయి.
 

ఇక జుట్టు ఎక్కువ సేపు తడిగా ఉండటం వల్ల చుండ్రు సమస్యలు ఏర్పడతాయి. చెమట వల్ల కూడా చుండ్రు సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఇక వర్షంలో తడిసినప్పుడు కూడా జుట్టును వెంటనే తుడుచుకోవాలి.
 

జుట్టు తడిగా ఉండటం వల్ల తలలో దురద వస్తుంది. చుండ్రు అనేది అంత సులువుగా జుట్టు వదలదు. తడి ఆరాక కూడా చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సహజ పద్ధతిలో జుట్టుకు కొన్ని టిప్స్ వాడాలి.
 

ఇక తడి జుట్టును అలాగే కట్టుకోవడం వల్ల జుట్టు పెళుసుగా మారుతుంది. దాని వల్ల జుట్టు పూర్తిగా పలుచబడుతుంది. పైగా జుట్టు రంగు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తడి జుట్టును ఎక్కువసేపు ఉంచకుండా స్నానం చేసిన వెంటనే తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
 

కొందరు జుట్టు త్వరగా ఆరిపోవడానికి ఎయిర్ డ్రైయర్ ను కూడా వాడుతుంటారు. అలా వాడటం వల్ల కూడా వేడికి జుట్టు ఊడే సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

click me!