Beauty Tips: పళ్ళు తెల్లగా ఉంటేనే ముఖానికి అందం. అలాంటి పళ్ళు గార పట్టినట్లు ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాదు అనారోగ్యానికి కూడా కారణం అవుతుంది అందుకే వంటింట్లో ఉండే వస్తువులతోనే పళ్ళని ఎలా మెరిపించుకోవాలో చూద్దాం.
ముఖానికి అందం చిరునవ్వు అయితే చిరునవ్వుకి అందం తెల్లని ముత్యాలు అంటే దంతాలు. అలాంటి దంతాలు కొందరికి ఎంత శుభ్రం చేసుకున్న తెల్లగా మెరువవు పసుపు రంగులోనే ఉంటాయి. దానికోసం రకరకాల టూత్ పేస్టులు మారుస్తూ ఉంటారు అయితే ఇంట్లో ఉండే వస్తువులతోనే పళ్ళని ముత్యాల్లా మెరిసేలాగా చేయవచ్చు అది ఎలాగో చూద్దాం.
26
ముందుగా కొన్ని మెంతులని తీసుకొని లైట్ గా వేయించండి. తర్వాత మెత్తని పొడి చేసి పెట్టుకోండి. ఉదయం లేవగానే చిన్న గిన్నెలో అర స్పూన్ మెంతిపొడి చిటికెడు పసుపు మీరు రోజు వాడే టూత్ పేస్ట్ తీసుకొని బాగా కలుపుకోండి.
36
ఆ తర్వాత ఈ మిశ్రమంతో రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్మూత్ గా దంతాలని తోముకోండి ఇలా గనక చేస్తే దంతాలు మిలమిల మెరవడం ఖాయం. అలాగే ఒక చిన్న గిన్నెలో అర స్పూను బేకింగ్ సోడా, అర స్పూను హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు మీరు రెగ్యులర్గా వాడే..
46
టూత్ పేస్ట్ కలిపి ఆ మిశ్రమంతో దంతాలని తోముకుంటే దంతాలకి పట్టిన పసుపు గార వదిలిపోయి పళ్ళు తెల్లగా మారుతాయి. అలాగే వారానికి రెండుసార్లు గోరువెచ్చని నువ్వుల నూనెతో నోటిని పుక్కిలించండి.
56
అలాగే ఆరెంజ్ తొక్కను మీ దంతాల మీద వారానికి ఒకసారి రుద్దటం వలన మంచి ఫలితం ఉంటుంది. బిర్యానీ ఆకులు మెత్తగా పొడి చేసి కొద్దిగా పాలు మిక్స్ చేసి ఈ పేస్ట్ ని దంతాల మీద అప్లై చేయాలి.
66
10 నిమిషాల తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవడం వలన మీ పళ్ళు తెల్లగా కనిపిస్తాయి అలాగే కలబందను మీ దంతాలతో కొరకటం వల్ల మీ పళ్ళు తెల్లగా మెరుస్తాయి. అలాగే పసుపు పాల యొక్క మిశ్రమం దంతాలని శుభ్రం చేయడంతో పాటు ఇన్ఫెక్షన్ లేకుండా కూడా చేస్తుంది.