Health Tips : కాళ్ల నొప్పులు భరించలేకపోతున్నారా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి?

Published : Jul 20, 2023, 11:36 AM IST

Health Tips: పిల్లలనుంచి వృద్ధుల వరకు కాళ్ల నొప్పి అనేది ఒక సాధారణ ఇబ్బందికర సమస్య. దీని వలన రోజువారి పనులు కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటాయి. ఇంట్లో ఉండే వస్తువులతోనే కాళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చట అదేంటో చూద్దాం.  

PREV
16
Health Tips : కాళ్ల నొప్పులు భరించలేకపోతున్నారా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి?

సాధారణంగా కాళ్ల నొప్పి మరియు బలహీనత అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ నొప్పి పోషకాహార లోపం కండరాల అలసట ఎక్కువ సమయం నిలబడటం నరాల సమస్యలు ఎముకల పగుళ్లు మొదలైన వాటి వలన వస్తుంది.

26

వీటిలో చాలా మటుకు నొప్పులని ఇంట్లోనే ఉండే వస్తువులతో ఉపశమనం పొందవచ్చు అది ఎలాగో చూద్దాం. గోరువెచ్చని  నీటిలో ఒకటి లేదా రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఆ నీటిలో నొప్పిగా ఉన్న కాళ్ళని పెట్టి కాసేపు అలాగే ఉంచండి.
 

36

ఈ ద్రావణంలో కాలుని ఉంచటం వలన ఆర్థరైటిస్ మరియు గౌట్ నొప్పికి సహాయపడుతుంది. నొప్పిని తగ్గించడానికి అవసరమైన పొటాషియం ని కాల్షియం ఇస్తుంది. అలాగే దాండిలైన్ ఆకులలో విటమిన్ ఏ మరియు సి అధికంగా ఉంటాయి. ఈ విటమిన్లు దెబ్బతిన్న కణజాలాన్ని సరి చేయడంలో సహాయపడతాయి.

46

అలాగే టార్ట్ చెర్రీ జ్యూస్ తాగటం వలన కూడా కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చును టార్చ్ చెర్రీస్ ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల్ని కలిగి ఉంటాయి వీటిలో ఆంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

56

ఈ రెండు లక్షణాలు మృదువ కణజాల గాయానికి చికిత్స చేయడంలోని మరియు నొప్పిని తగ్గించడంలోని సహాయపడతాయి. అలాగే గుడ్డు క్యారెట్ గోధుమ ఓట్స్ కాటేజ్ చీజ్ చేపలు మొదలైనవి బి విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని తినటం వలన నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చును.

66

అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే గుమ్మడికాయ విత్తనాలు చిక్కుడుకాయలు, క్యాబేజీ ఫుడ్ పాలకూర మొదలైనవి తినటం తో పాటు శరీరానికి అవసరమైన నీరుని తప్పనిసరిగా తాగాలి. ఇవన్నీ నొప్పి భరించగలిగేదిగా ఉన్నప్పుడు మాత్రమే నొప్పి భరించలేనిదిగా మారినప్పుడు వైద్యుడిని సంప్రదించడమే మంచిది.

click me!

Recommended Stories