వ్యాయామం చేస్తున్నా.. బరువు పెరిగితే ఎంతో నిరాశ కలుగుతుంది. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే పక్కాగా బరువు తగ్గాల్సిందే. అయితే చాలా మంది బరువు తగ్గడానికి అన్నీ చేసినా కొంచెం కూడా తగ్గరు. ఇలా మీరు బరువు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
హార్మోన్ల అసమతుల్యత
థైరాయిడ్ గ్రంధి పనిచేయకపోవడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్), ఇన్సులిన్ నిరోధకత వంటి హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా బరువు పెరుగుతారు. మీ ఆహారపు అలవాట్లు మెరుగ్గా ఉన్నా.. ఈ సమస్యల వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారని నిపుణులు చెబుతున్నారు.
over weight
మందుల దుష్ప్రభావాలు
కొన్ని రకాల మందులు కూడా మీరు విపరీతంగా బరువు పెరగడానికి కారణమవుతాయి. ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్స్, యాంటి సైకోటిక్స్, కార్టి కోస్టెరాయిడ్స్ తో సహా కొన్ని మందులు జీవక్రియ, ఆకలి నియంత్రణపై ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా మీరు బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
Weight gain
ఒత్తిడి, కార్టిసాల్
దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది పొట్ట కొవ్వును పెంచడంతో సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి వల్ల కొంతమంది విపరీతంగా తింటారు. ఇది బరువును బాగా పెంచుతుంది.
weight gain
నిద్ర లేకపోవడం
అవును నిద్రలేకపోవడం వల్ల కూడా మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారంటున్నారు నిపుణులు. ఎలా అంటే? నిద్ర లేమి హార్మోన్ల సమతుల్యత, జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. పేలవమైన నిద్ర ఎక్కువ కేలరీలు, చక్కెర ఆహారాల కోసం కోరికలను కూడా పెంచుతుంది.
ద్రవం నిల్వ
ఎడెమా, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (పిఎంఎస్), కొన్ని వైద్య చికిత్సలు వంటి పరిస్థితులు శరీరంలో ద్రవం నిల్వ ఉండటానికి కారణమవుతాయి. ఇది కొవ్వు పెరగడానికి దారితీస్తుంది. ఇది మీరు తాత్కాలిక బరువు పెరగడానికి దారితీస్తుంది.
అంతర్లీన అనారోగ్య సమస్యలు
పాలిసిస్టిక్ మూత్రపిండాల వ్యాధి, హైపోథైరాయిడిజం, కుషింగ్స్ సిండ్రోమ్ వంటి సమస్యలు జీవక్రియ, శక్తి నియంత్రణపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు.