Health Tips: వే ప్రోటీన్ ఆడవాళ్లు ఎంత వరకు తీసుకోవచ్చు.. అపోహలు పక్కనపెట్టి నిజాలు తెలుసుకోండిలా?

Published : Aug 25, 2023, 02:33 PM IST

Health Tips: వే ప్రోటీన్లు ఆడవాళ్లు ఎక్కువగా తీసుకోకూడదని, అథ్లెట్లు మాత్రమే తీసుకుంటారని, ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడైపోతాయని చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి వాటి గురించి నిజా నిజాలు తెలుసుకుందాం.  

PREV
16
Health Tips: వే ప్రోటీన్ ఆడవాళ్లు ఎంత వరకు తీసుకోవచ్చు.. అపోహలు పక్కనపెట్టి నిజాలు తెలుసుకోండిలా?

అసలు వే ప్రోటీన్ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాము. పాల ప్రోటీన్లను సంగ్రహించి వాటిని మరింత పోర్టబుల్ రూపంలోకి మార్చడం ద్వారా తయారు చేయబడిన పొడి ఈ వే ప్రోటీన్. పాల విరుగుడు ప్రోటీన్.. పాల యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను సంరక్షించడంలో సహాయపడుతుంది.
 

26

అలాగే ఆరోగ్యకరమైన ఎముకలు, కండరాలు, జుట్టు అలాగే అవయవాల పనితీరుకు ఈ ప్రోటీన్  ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మహిళలు కూడా వే ప్రోటీన్లు తీసుకోవచ్చు. వే ప్రోటీన్ తీసుకుంటే స్త్రీలు పురుషుల్లాగా ఏమి కనిపించరు. ఈ ప్రోటీన్ లని స్త్రీలు తీసుకోకూడదని చాలామందికి అపోహ ఉంది.
 

36

కానీ స్త్రీలు కూడా నిరభ్యంతరంగా ఈ ప్రోటీన్ లను తీసుకోవచ్చు. ఇది వారికి అవసరమైన పోషకాలని అందించడంలోను, కండరాలని రిపేర్ చేయడంలోనూ సహయపడుతుంది. అలాగే వే ప్రోటీన్ వర్కౌట్స్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అనేది కూడా అపోహ మాత్రమే.
 

46

వే ప్రోటీన్ ని ఎవరైనా రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అల్పాహారం సమయంలో తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. ఇది కేవలం బాడీబిల్డర్లు, అథ్లెట్లు మాత్రమే తీసుకుంటారు అనేది కూడా అపోహ. దీనిని తీసుకోవడం వలన బాడీ కండలు తిరిగి ఆడవాళ్లు కూడా మగవాళ్ళు లాగా కనబడతారు అనుకోవడం కూడా అపోహ మాత్రమే.
 

56

అలాగే ఇందులో ఎలాంటి స్టెరాయిడ్లు ఉండదు. ఇది కేవలం ప్రోటీన్ మాత్రమే. అయితే డైరీ ఎలర్జీలు ఉన్నవారు ఈ వే ప్రోటీన్ తీసుకోకూడదు. ప్రోటీన్ ని అధిక మొత్తంలో ఒకేసారి తీసుకోకూడదు. కిడ్నీ వ్యాధి లేని వారి కిడ్నీలపై అధిక ప్రోటీన్ ఆహారం ప్రభావం చూపే అవకాశం లేదు.
 

66

అయినప్పటికీ ఈ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి మూత్రపిండాలలో అంతర్గత ఒత్తిడిని పెంచుతాయి. ఇది మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి ఈ ప్రోటీన్ ఇబ్బందిని కలుగచేస్తుంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించకుండా ఈ ప్రోటీన్ మీకుగా మీరు ఉపయోగించవద్దు.

click me!

Recommended Stories