అటుకులు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 11, 2024, 2:07 PM IST

అటుకులను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ అటుకులను తింటే ఏమౌతుందో తెలుసా?

అటుకులను పోహా అని కూడా అంటారు. వీటితో రకరకాల వంటలను చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటిని పోపు పెట్టుకుని తింటే బలే టేస్టీగా ఉంటుంది. అందుకే అటుకులను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు.

వీటిని ఈవినింగ్ స్నాక్స్ గా, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా, మధ్యాహ్నం భోజనంగా తినొచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అటుకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అసలు అటుకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


అటుకులలోని పోషకాలు 

అటుకుల్లో 18.8 గ్రాముల కార్భోహైడ్రేట్లు, 130 కేలరీలు, 2.4 గ్రాముల ప్రోటీన్లు, 1.14 గ్రాముల కొవ్వులు, 0.9 గ్రాముల డైటరీ ఫైబర్, 4.46 మిల్లీ గ్రాముల ఐరన్ కంటెంట్, 9.19 మిల్లీ గ్రాముల కాల్షియం కాల్షియంలు ఉంటాయి. 

అటుకులను తినడం వల్ల కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు

సులువుగా జీర్ణమవుతుంది

అటుకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. తిన్నది సులువుగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అటుకులను తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే దీనిలో ఉండే పోషకాలను మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. కాబట్టి ఇది బెస్ట్ బ్రేక్  ఫాస్ట్ అని చెప్పొచ్చు. అటుకులను తినడం వల్ల మీరు రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. 
 


vegetables

పుష్కలంగా పోషకాలు

అటుకుల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అంటే అటుకులను తినడం వల్ల శరీరంలో స్థిరమైన ఎనర్జీ ఉంటుంది. అలాగే ఇది శరీరంలో అనవసరంగా కొవ్వు నిల్వ కాకుండా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే శరీర విధులు సక్రమంగా జరిగేలా చేస్తుంది. 

బ్లడ్ షుగర్ కంట్రోల్ 

అటుకులు డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అటుకుల్లో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి లేదా రక్తంల చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవాలనుకునేవారికి ఇది చాలా మంచిది. 
 


గ్లూటెన్ లేనిది 

అటుకుల్లో గ్లూటెన్ అసలే ఉండదు. గ్లూటెన్ అసహనం లేదా సున్నితత్వం ఉన్నవారికి మంచి భోజనం అటుకులనే చెప్పాలి. ఇవి మీకు టేస్టీ టేస్టీ, ఎలాంటి భయం లేని బ్రేక్ ఫాస్ట్ అవుతాయి. ఇది తినడం వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు. 

అటుకులు తినడం వల్ల వచ్చే సమస్యలు

కడుపు నొప్పి

అటుకుల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. నిజానికి ఇది మన జీర్ణ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయినప్పటికీ.. వీటిని మరీ ఎక్కువగా తినడం వల్ల అపానవాయువు (పిత్తులు), కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు అసౌకర్యం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అనారోగ్యం

కొన్ని కొన్ని సార్లు అటుకులను తినడం వల్ల మీరు అనారోగ్య బారిన కూడా పడాల్సి వస్తుంది. ముఖ్యంగా వండని అటుకులను తింటే. ఎందుకంటే పచ్చి అటుకుల్లో బ్యాక్టీరియా లేదా టాక్సిన్స్ ఉంటాయి. ఇవి మీ శరీరంలోకి వెళ్లి మిమ్మల్ని అనారోగ్యం బారిన పడేస్తాయి. వీటిని బాగా వండి తింటే మీకు ఎలాంటి సమస్యలు రావు. 

ఇనుము విషపూరితం

అటుకుల్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే మీరు ఈ ఐరన్ ను మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే మాత్రం అది విషంలా మారుతుంది. దీనివల్ల మీ శరీరం డీహైడ్రేట్ అవ్వడం, వాంతులు, విరేచనాలు, మగత వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలు , ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే పచ్చి అటుకులను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!