మారెడు ఆకులు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 9, 2024, 5:01 PM IST

బిల్వ పత్రాన్ని మారెడు  ఆకులు అని కూడా ఉంటారు. ఈ ఆకులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీన్ని శివపూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఆకులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆకులను నమలడం వల్ల ఎన్ని వ్యాధులు దూరమవుతాయో తెలుసా? 

బిల్వ పత్రం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసి ఉంటుంది. ఈ ఆకును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈ ఆకును దేవుడి పూజకు ఉపయోగిస్తారు. ఈ ఆకు శివుడికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనితో పరమేశ్వరుడిని పూజిస్తారు. 
 

bilva pathre

అయితే ఒక్క పూజకే కాదు.. ఈ ఆకును మన ఆరోగ్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు.  అవును దీన్నిఉదయం పరిగడుపున నమలడం వల్ల మీరు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బిల్వ పత్రాన్ని పరిగడుపున తినడం వల్ల కలిగే రెండు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


immunity


బిల్వ పత్రాన్ని తింటే ఏమౌతుంది? 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మన రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మీకు పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య, జబ్బు వస్తే గనుక మీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. 

అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి బిల్వ పత్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆకును నమలడం వల్ల మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యాధులతో పోరాడటానికి మీ శరీరానికి బాగా సహాయపడుతుంది. మీకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండే మీకు దగ్గు, జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

జీర్ణక్రియను పెంచుతుంది

బిల్వ పత్రాన్ని తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సరిగ్గా లేనివారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీర్ణక్రియ సరిగా లేకపోయినా, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నా, అజీర్ణం సమస్య ఉన్నా.. బిల్వ పత్ర ఆకులను నమలండి. 

ఈ ఆకులు కడుపులో ఆమ్లాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకులో ఉండే సహజ యాంటీ యాసిడ్ లక్షణాలు ఇందుకు సహాయపడతాయి. బిల్వ పత్ర ఆకులు మలబద్దకం సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ ఆకులు ప్రేగులను సక్రియం చేస్తాయి.

అలాగే పేగు కదలికలను మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఈ పచ్చని ఆకులు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. అలాగే కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!