
ఇవి చర్మానికి తాత్కాలిక పైపై మెరుపులను అందిస్తాయి. కనుక చర్మాన్ని లోపల నుంచి ఆరోగ్యవంతంగా ఉంచి అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఇంటిలో అందుబాటులో ఉండే కూరగాయలు (Vegetables) సహాయపడతాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని (Skin beauty) కూడా రెట్టింపు చేస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కూరగాయలలో అనేక పోషకాలు (Nutrients) ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మానికి కావలసిన పోషకాలను కూడా అందించి చర్మాన్ని లోపలి నుంచి తాజాగా ఉంచి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. ఇవి చర్మంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు, వృద్ధాప్య ఛాయాలను తొలగించి చర్మాన్ని తాజాగా (Fresh skin) ఉంచుతాయి.
అలాగే వీటితోపాటు కాలానుగుణంగా అందుబాటులో ఉండే అన్ని రకాల పండ్లు (Fruits), కూరగాయలను (Vegetables) ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహార పదార్థాలతో పాటు చేయదగిన చిన్న చిన్న వ్యాయామాలను చేయడం మంచిది.
దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. బయట మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty products) కంటే చర్మ సౌందర్యం కోసం కూరగాయలతో చేసుకునే ఫేషియల్స్ ను ఉపయోగిస్తే చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) ఉండవని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తక్కువ ఖర్చుతో సహజసిద్ధమైన పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకునే ఫేషియల్స్ చర్మానికి మంచి ఫలితాలను అందిస్తాయి.
టమోటా ఫేషియల్: ఒక గిన్నెలో కొద్దిగా టమోటా రసం (Tomato juice), చిటికెడు పసుపు (Turmeric), ఒక స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే చర్మంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
బీట్రూట్ ఫేషియల్: బీట్రూట్ లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి ఫలితాలను అందిస్తాయి. ఇందుకోసం ఒక కప్పులో బీట్రూట్ రసం (Beetroot juice), కొద్దిగా నారింజ తొక్కల పొడి (Orange peel powder) వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దన చేసుకుని ఆరిన తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
క్యారెట్ ఫేషియల్: ఒక కప్పులో కొద్దిగా క్యారెట్ గుజ్జు (Carrot pulp), ఒక స్పూన్ పెరుగు (Curd), చిటికెడు పసుపు (Turmeric) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది. క్యారెట్ లో ఉండే పోషకాలు చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరిచి చర్మాన్ని తాజాగా ఉంచి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
బంగాళదుంప ఫేషియల్: బంగాళదుంప గుజ్జుకు (Mashed Potatoes) కొద్దిగా నిమ్మరసం (lemon juice) కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరచుకోవాలి. బంగాళదుంపలో ఉండే సహజ సిద్ధమైన బ్లీచింగ్ గుణాలు నల్లగా కమిలిపోయిన చర్మానికి మంచి ఫలితాలను అందిస్తాయి. దీంతో మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.