రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు..? మరీ నిద్ర ఎక్కువైనా ప్రమాదమే..!

First Published Dec 1, 2021, 3:36 PM IST

శరీరం సక్రమంగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  అంతుకు మించి ఎక్కువ గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదట. అధిక నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అధిక నిద్ర స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

మనిషికి నిద్ర చాలా అవసరం. మనం ఎంత ఆహారం తీసుకున్నా.. సరిపడా నిద్ర లేనప్పుడు.. మనం ఆరోగ్యంగా ఉండలేం. అయితే.. నిద్ర అవసరం అన్నారు కదా.. అని గంటలకు గంటలు నిద్రపోతే.. అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ నిద్రపోయే వ్యక్తులకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. పక్షవాతం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. కాబట్టి.. ఆరోగ్యకరమైప లైఫ్ స్టైల్ ని మనం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అతిగా నిద్రపోవడం వల్ల కలిగే అనర్థాలేంటో ఓసారి చూద్దాం..

sleep

శరీరం సక్రమంగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  అంతుకు మించి ఎక్కువ గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదట. అధిక నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అధిక నిద్ర స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

sitting sleep

మనలో చాలా మంది వారాంతాల్లో ఎక్కువ కాలం నిద్రపోతారు. ఎందుకంటే.. ఆ రోజుల్లో పని ఉండదు కాబట్టి.. రెస్ట్ తీసుకోవాలని అనుకుంటారు.  రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య నిద్రపోయే వారి కంటే రోజుకు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

sleep

మెదడులోని భాగానికి రక్త ప్రవాహం లేక రక్తస్రావం జరగనప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఇది మెదడు కణజాలానికి నష్టం కలిగిస్తుంది. లైఫ్ స్టైల్ సరిగా లేని సమయంలోనే యువత ఎక్కువగా.. స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.

డిసెంబర్ 11, 2019 న, అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ , మెడికల్ జర్నల్ జర్నల్ ఆఫ్ న్యూరాలజీ ఆన్‌లైన్ ఎడిషన్‌లో, శాస్త్రవేత్తలు62,000 మంది పై పరిశోధన చేయగా.. దాదాపు సగం మందికిపైగా స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు.

sleep and diet

అంతేకాదు.. కనీస నిద్ర కూడా పోకుండా చాలా తక్కువగా నిద్రపోయేవారిలోనూ స్ట్రోక్ 82శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. అంతేకాదు.. జ్ఞాపకశక్తి సమస్యలు కూడా మొదలౌతాయట.

8 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం స్ట్రోక్‌తో ఎలా ముడిపడి ఉంటుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు, అయితే ఎక్కువగా నిద్రపోయే వ్యక్తుల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని గమనించబడింది. ఇది బరువు పెరగడానికి స్ట్రోక్ ప్రమాదానికి దారితీస్తుంది.

sleep

ఆరోగ్యకరమైన ఆహారం , మంచి లైఫ్ స్టైల్ ఎంపిక  చేసుకోవడం స్ట్రోక్ ప్రమాదాన్ని 80 శాతం తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు నమ్ముతారు. కాబట్టి జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించి స్మోకింగ్ మానేయండి. మీ రక్తపోటు, చక్కెర , బరువును పరీక్షించడం మంచి జీవితాన్ని గడపడం, మీ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడం అంతే ముఖ్యం.

click me!