మీ టీలో ఉల్లిపాయ ఉందా?.. అయితే జలుబు, దగ్గులకు చెక్..

First Published Nov 30, 2020, 4:19 PM IST

ఉల్లిపాయ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు ఆ కాంబినేషన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఉల్లి పాయ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఓ కప్పుడు ఈ ఉల్లిపాయ టీ తాగితే జలుబు, దగ్గులు దరిచేరవని హామీ కూడా ఇస్తున్నారు. 

ఉల్లిపాయ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు ఆ కాంబినేషన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఉల్లి పాయ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఓ కప్పుడు ఈ ఉల్లిపాయ టీ తాగితే జలుబు, దగ్గులు దరిచేరవని హామీ కూడా ఇస్తున్నారు.
undefined
సీజనల్‌ వ్యాధుల నివారణకు ఎన్నో వంటింటి చిట్కాలు ఉంటాయి. జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సాధారణ సీజనల్‌ వ్యాధులకైతే మన అమ్మలు, అమ్మమ్మలు అనేక చిట్కాలు చెబుతుంటారు. వంటింటి చిట్కాలతో చిటికెలో ఉపశమనం కూడా కలిగిస్తారు.
undefined

Latest Videos


ఈ వంటింటి చిట్కాలతో వ్యాధులనుండి ఉపశమనమే కాక రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాకపోతే ఈ తరం ఇలాంటివి పెద్దగా నమ్మరు. పాత చింతకాయ పచ్చడి అని కొట్టిపడేస్తారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు.
undefined
అలా మేలు చేసే వాటిలో ఉల్లిపాయ ముందు వరుసలో ఉండే సంగతి తెలిసిందే. ఉల్లిపాయలు వంటలకు రుచి ఇవ్వడమే కాక, ఆరోగ్య లక్షణాలను కూడా ప్రేరేపిస్తాయట. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి వచ్చింది.
undefined
ప్రస్తుతం ఈ చలికాలంలో చాలా మంది జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారంతా తక్షణ ఉపశమనం కోసం ఈ ఉల్లిపాయ టీ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
ఈ ఉల్లిపాయ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని పరీశోధనలో కూడా వెల్లడైందట. అంతేగాక ఉల్లిపాయ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలకు కూడా అమూల్యమైన వనరు అని నిపుణులు చెబుతున్నారు.
undefined
కాబట్టి ఈ ఉల్లిపాయలతో చేసిన వెచ్చని టీని ఓ కప్పు మీ రోజు వారి ఆహారపు ఆలవాట్లలో చేర్చుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఉల్లిపాయతో లేదా వాటి తొక్కలతో కూడా చేసుకోవచ్చు.
undefined
ఉల్లిపాయ టీ ఎలా తయారు చేయాలంటే :ఒక గ్లాసు నీరు మరిగించి అందులో తరిగిన ఉల్లిపాయ, 2-3 నల్ల మిరియాలు, 1 యాలక్కాయతో పాటు సగం చెంచా సోపు గింజలను జోడించాలి. దీనిని 15-20 నిమిషాల పాటు మరగించి తర్వాత వడకట్టుకుని తాగాలి.
undefined
ఉల్లిపాయ పొట్టుతో టీ :టీ పోడి లేదా గ్రీన్‌ టీ ఆకులు వేసి నీటిని మరగించాలని ఆ తర్వాత మరిగించిన నీటిని చిన్న ఉల్లిపాయ లేదా సగం ఉల్లిపాయ తొక్కలు తీసి ఉంచుకున్న కప్పులో పోయాలి. వేడి వేడి నీటిలో సుమారు 10 నిమిషాలు పాటు ఈ ఉల్లిపాయ తొక్కలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి తేనె, నిమ్మరసం కులుపుకుని తాగాలి.
undefined
click me!