బరువు తగ్గడం ఇంత సులభమా..?!

First Published Nov 30, 2020, 12:50 PM IST

అందరూ అనుకున్నంత కష్టమేమీ కాదని నిపుణుల అభిప్రాయం. కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే.. బరువు తగ్గడంతోపాటు.. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును కూడా సులభంగా తగ్గంచుకోవచ్చు.

నచ్చిన ఆహారం కడుపునిండా లాంగించేస్తే.. వద్దన్నా బరువు పెరిగేస్తాం. కానీ.. ఆ పెరిగిన బరువు తగ్గించడం మాత్రం చాలా కష్టం. దాదాపు అందరి అభిప్రాయం ఇలానే ఉంటుంది. బరువు తగ్గడం చాలా కష్టమని అనుకుంటారు. అయితే.. అందరూ అనుకున్నంత కష్టమేమీ కాదని నిపుణుల అభిప్రాయం. కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే.. బరువు తగ్గడంతోపాటు.. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును కూడా సులభంగా తగ్గంచుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి చూద్దామా..
undefined
1. బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా ముందు మన పొట్ట ఆరోగ్యంగా ఉండాలట. ముందు మన పొట్టలోపల ఆరోగ్యంగా ఉంటే సులభంగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా.. తీసుకునే ఆహారంలో ప్రో బయోటిక్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలట. అది పెరుగులో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి.. ప్రతిరోజూ ఆహారంలో పెరుగుని తీసుకోవాలి.
undefined
2.ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కచ్చితంగా మీ డైట్ లో భాగం చేసుకోవాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
undefined
3. మద్యం ఎక్కువగా సేవించేవారు కూడా సులభంగా బరువు పెరుగుతారు. కాబట్టి వారు ముందు మద్యం సేవించే అలవాటు మానుకోవాలి.
undefined
4.కొందరికి ఆకలిగా లేకపోయినా ఏదో ఒకటి నమిలే అలవాటుు ఉంటుంది. అలాంటి వారు.. బేకరీ ఫుడ్స్ కాకుండా.. సీ విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం ఉత్తమం.
undefined
5.నిద్ర సరిగా లేకపోయినా కూడా సులభంగా బరువు పెరుగుతారు. కాబట్టి.. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
undefined
6.తీపి పదార్థాలు ఎక్కువగా తినకపోవడమే మంచిది. బెల్లం లాంటివి కొంచెం తీసుకోవచ్చు.
undefined
ఈ రూల్స్ పాటిస్తే.. బరువు తగ్గడం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు.
undefined
click me!