కొబ్బరి పాలను ఎప్పుడైనా తాగారా? వీటితో బోలెడు లాభాలున్నాయి మరి

Published : Jul 25, 2023, 01:13 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరి పాలను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఇది వంటలను రుచికరంగా చేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది తెలుసా?   

PREV
18
 కొబ్బరి పాలను ఎప్పుడైనా తాగారా? వీటితో బోలెడు లాభాలున్నాయి మరి
Image: Getty

కొబ్బరి నుంచే  కొబ్బరి పాలను తయారుచేస్తారు. ఈ పాలను ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ పాలు వంటలను టేస్టీగా చేస్తాయి. నిజానికి ఈ పాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి.  కొబ్బరి పాలను తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అవేంటంటే..?
 

28
Image: Getty

పోషకాలు ఎక్కువగా ఉంటాయి

కొబ్బరి పాలలో విటమిన్ సి,  విటమిన్ ఇ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ పోషక లోపాలను పోగొడుతాయి. 
 

38
Image: Getty

ఆరోగ్యకరమైన కొవ్వులు

కొబ్బరిపాలు మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ కు గొప్ప మూలం. ముఖ్యంగా లారిక్ ఆమ్లం. ఎంసిటిలు శరీరం ద్వారా సులభంగా గ్రహించబడతాయి. అలాగే తక్షణమే శక్తి వనరుగా ఉపయోగించబడతాయి.
 

48
Image: Getty

గుండె ఆరోగ్యం

 కొబ్బరి పాలలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా బాగుంటుంది. గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.  

58
Image: Getty

జీర్ణ ఆరోగ్యం
 
కొబ్బరి పాలలో  మీడియం-చైన్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇవి రక్తప్రవాహంలోకి నేరుగా గ్రహించబడతాయి. అలాగే మనకు శక్తి వనరుగా ఉపయోగించబడతాయి.
 

68
Image: Getty

రోగనిరోధక వ్యవస్థ

కొబ్బరి పాలలో ఉండే లారిక్ ఆమ్లం యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే అంటువ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.

78
Image: Getty

ఎముకల ఆరోగ్యం

కొబ్బరి పాలలో కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

88
Image: Getty

చర్మం, జుట్టు సంరక్షణ

కొబ్బరి పాలను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ఆర్ద్రీకరణ మెరుగుపడుతుంది. తేమగా ఉంటుంది. అలాగే కొబ్బరి పాలు జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories