రాత్రిళ్లు ఇన్నర్స్ లేకుండా నిద్రపోతే..!

First Published | Jul 30, 2023, 4:25 PM IST

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రిళ్లు ఇన్సర్స్ లేకుండా నిద్రపోవడం మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. అలాగే..

Image: Getty

ఒక్కొక్కరికీ ఒక్కోలా నిద్రపోయే అలవాటు ఉంటుంది. కొందరు మొత్తమే బట్టలు లేకుండా నిద్రపోతే.. ఇంకొందరు ఇన్నర్స్ ను ఉంచుకుని మిగతావి తీసేసి పడుకుంటారు. మరికొందరు ఇన్నర్స్ ను తీసేసి పడుకుంటారు. నిపుణుల ప్రకారం.. ఇన్సర్స్ ను తీసేసి నిద్రపోవడం మంచి అలవాటు. దీనివల్ల మీరు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారు. అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అసలు ఇన్నర్స్ లేకుండా పడుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మెరుగైన గాలి ప్రసరణ

ఇన్నర్స్ వల్ల జననేంద్రియాల చుట్టూ చెమట పడుతుంది. అలాగే ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఇది చిరాకును కలిగించడంతో పాటుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఈ సమస్యలు రావొద్దంటే ప్రైవేట్ భాగానికి గాలి చేరాలి. అయితే ఇన్నర్స్ లేకుండా ఉంటే జననేంద్రియాలకు గాలి ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వెచ్చని, తేమతో కూడిన ప్రాంతాలలో ఉన్నవారికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.  మెరుగైన గాలిప్రవాహం అక్కడ తేమ ఏర్పడకుండా ఉండటానికి, బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
 


చర్మపు  చికాకు

ఇన్నర్స్ క్లాత్ సరిగ్గా లేకపోవడం వల్ల అవి చర్మంపై చికాకును కలిగిస్తాయి. అంతేకాదు అలెర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే రాత్రిపూట లోదుస్తులను తొలగించి నిద్రపోతే ఈ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు మీరు హాయిగా నిద్రపోతారు కూడా. 

సరైన ఉష్ణోగ్రత

నిద్రపోయేటప్పుడు లోదుస్తులను తొలగించడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఇది మీకు ప్రశాంతమైన నిద్ర రావడానికి సహాయపడుతుంది.  రాత్రిపూట శరీరం సహజంగా సౌకర్యంగా ఉండేండుకు ఇది సహాయపడటంతో పాటుగా శరీరం వేడెక్కడాన్ని నివారిస్తుంది.
 

మెరుగైన రక్త ప్రసరణ

లోదుస్తులు లేకపోవడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా కటి ప్రాంతంలో. వదులుగా ఉండే లేదా లోదుస్తులు మొత్తమే లేకుండా నిద్రపోవడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రవాహం పెరగడం వల్ల పురుషులు, మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మీరు సెక్స్ లో చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది.
 

విశ్రాంతి, సౌకర్యాన్ని ప్రోత్సహించడం

లోదుస్తులు  రిలాక్స్డ్ గా, సౌకర్యవంతమైన స్థితిలో నిద్రపోవడానికి ఆటంకం కలిగిస్తాయి. అంతేకాదు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టకుండా చేస్తాయి. అయితే లోదుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల మీరు బాగా విశ్రాంతి తీసుకుంటారు. అలాగే గాఢంగా నిద్రపోతారు.
 

సన్నిహిత ఆరోగ్యంపై సానుకూల ప్రభావం

కొంతమందికి పగలు, రాత్రంతా టైట్ లోదుస్తులు ధరించడం వల్ల చర్మపు చికాకు, ఎరుపు లేదా దురద వంటి సమస్యలు వస్తాయి. మీరు నిద్రపోతున్నప్పుడు జననేంద్రియాలకు గాలి చేరితే మీ సన్నిహిత ఆరోగ్యం బాగుంటుంది. 

Latest Videos

click me!