తులసి ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క. అందుకే తులసిని ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పరగడుపున తులసి ఆకులతో మరిగించిన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ఈ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరం నుంచి అవాంఛిత కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది.
తులసి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. పరగడుపున ఈ నీటిని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు నిపుణులు.