వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి కూరగాయలు కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్లతో సహా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 2014 లో 13,333 మంది పాల్గొన్న 16 అధ్యయనాల సమీక్షలో.. ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినేవారికి పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.