అలాగే అరటి పళ్ళు పొడిబారిన జుట్టుని మరమ్మత్తు చేసి సహజ స్థితికి తీసుకువస్తాయి. అరటి పండ్లలో ఉండే పొటాషియం మాడుపైన ఉండే బ్యాక్టీరియాని తొలగించి ఆరోగ్యవంతమైన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. బాగా పండిన అరటిపండుని మాడుకి, జుట్టుకి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత షాంపుతో స్నానం చేయడం వలన జుత్తు ఆరోగ్యంగా అవుతుంది.