చెర్రీస్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మంచిదని మనకు తెలుసు. అయితే చెర్రీస్ గుజ్జు అందానికి ప్రయోజనకారి (Beneficial to beauty) అని మీకు తెలుసా.. చెర్రీ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి లతో పాటు జింక్, ఇనుము, పొటాషియం, రాగి, మాంగనీస్ మొదలైన ఇతర పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. ఇవి మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలను తగ్గించి చర్మాన్ని తేమగా ఉంచుతాయి.